పాకిస్తాన్ నుండి ధోనీకి ఆహ్వానం.. దేనికోసమో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వరల్డ్ క్రికెట్లో లెజెండరీ కెప్టెన్ గా ఎదిగిన ధోని అటు భారత క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను లికించుకున్నాడు  ఏకంగా భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను తన కెప్టెన్సీలో రెండు సార్లు అందించాడు. ఇక ఇప్పటికీ కూడా ధోని కెప్టెన్గా సాధించిన ఎన్నో రికార్డులు పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే అందరూ క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు.

 కానీ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన వార్త ఏదైనా ఇంటర్నెట్ లోకి వచ్చింది అంటే అధికాస్తా తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే 2006 -08 సమయంలో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు అక్కడ తిన్న భోజనం తనకు ఎంతో నచ్చింది అంటూ మహేంద్రసింగ్ ధోని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో పై పాకిస్తాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫకర్ ఆలం స్పందిస్తూ ఎంఎస్ ధోని పాకిస్తాన్ ఫుడ్ ని ఇష్టపడటం పై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

 అయితే కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే కాకుండా ఆహారం తినేందుకు కూడా ఒకసారి పాకిస్తాన్ కు రావాలి అని ధోనిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అంటూ స్పోర్ట్స్ యాంకర్ ఫకర్ ఆలం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. అయితే ఇలా పాకిస్తాన్ ఆహ్వానంపై మహేంద్ర సింగ్ ధోని స్పందిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై పూర్తిగా నిషేధం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. దీంతో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. కనీసం ఈ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: