రెండో టెస్ట్ కి ముందు.. సౌత్ ఆఫ్రికాకు బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ టూర్ లో భాగంగా ప్రస్తుతం ఆతిద్య సఫారీ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా తప్పకుండా టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తుంది అని అందరూ ఊహించారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు పరాజయం ఎదురయింది. ఎందుకంటే అప్పటివరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని సౌత్ ఆఫ్రికా జట్టు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం అదరగొట్టేసింది.

 ఏకంగా పరిమిత ఓవర్లో ఫార్మాట్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన భారత జట్టును.. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే సౌత్ ఆఫ్రికా జట్టు దారుణమైన దెబ్బ కొట్టింది అని చెప్పాలి. ఏకంగా 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టును ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది సౌత్ ఆఫ్రికా. అయితే జనవరి మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి మరోసారి సిరీస్ ను కైవసం చేసుకోవాలి అని భావిస్తుంది. అయితే ఇక రెండో టెస్ట్ మ్యాచ్ కి ముందే అటు సౌత్ ఆఫ్రికా జట్టుకు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇటీవల విజయానందంలో ఉన్న సౌత్ ఆఫ్రికా కు మరో బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఏకంగా సౌత్ఆఫ్రికా జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న కోఎడ్జి ఇక జట్టుకు దూరమయ్యాడు. కంటి వాపు కారణంగా అతడు జట్టుకు అందుబాటులో ఉండడం లేదని ప్రొటీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కోయేడ్జి తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే అతను ఇక గాయంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో మరో స్టార్ ఫేసర్ లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: