టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియా విషయంలో కరోనా వైరస్ పగబట్టినట్టు గానే వ్యవహరిస్తోంది  అన్న విషయం తెలిసిందే. జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండటం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ కరోనా వైరస్ కారణంగా టీమిండియాకు ఊహించని రీతిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి . అయితే ఇక ఇప్పుడు మరో ఇద్దరు ప్లేయర్లు  వైరస్ బారిన పడ్డారు అన్నది తెలుస్తుంది.  అయితే భారత పురుషుల జట్టు లో కాదు భారత మహిళల జట్టు లో ఆ ఇద్దరు ప్లేయర్స్ ఇలా వైరస్ బారిన పడటం టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చింది.

 మరికొన్ని రోజుల్లో భారత మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో జరగబోయే టి20 టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధం అయింది అన్న విషయం తెలిసిందే. బర్మింగ్హామ్ వేదికగా జరగబోయే  ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో మునిగి తేలుతోంది. కాగా జూలై 28 వ తేదీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా పోటీలలో దీటుగా పోరాడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమ్ ఇండియా లోని ఇద్దరు ప్లేయర్లు వైరస్ బారిన పడినట్లు ప్రకటించింది జట్టు యాజమాన్యం.

 అయితే ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరూ అన్న విషయాన్ని మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇద్దరూ కూడా బర్మింగ్హామ్ లో జట్టుతో కలిసి ఇక మ్యాచ్లు ఆడతారు అంటూ తెలిపింది. అయితే మొదటి సారి కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం లభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నారు మహిళా క్రికెటర్లు. కాగా కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా జూలై 29 వ తేదీన టీమిండియా తన తొలి పోరులో పటిష్టమైన ఆస్ట్రేలియా ను ఢీ కొట్టేందుకు సిద్ధమౌతుంది. ఇక జూలై 31వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: