ఐసీసీ కొత్త రూల్స్‌..బ్యాట్స్‌మెన్లకు ఇక జాతరే !

Veldandi Saikiran
కాలం మారినా కొద్ది క్రికెట్‌ లోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్యాన్స్‌ కు క్రికెట్‌ బోర్‌ కొట్టకుండా... ఐసీసీ కొత్త.. కొత్త రూల్స్‌ తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా టీ20 క్రికెట్కు మరింత మజా తీసుకొచ్చేందుకు ఐసీసీ కొత్త స్కెచ్‌ వేసింది. ఈ ఫార్మాట్లో తాజాగా ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో స్లో ఓవర్ రేట్కు సంబంధించిన ఈ రూల్ చాలా కీలకమైంది. ఇప్పటివరకు స్లో ఓవర్ రేట్కు కారణమైతే కెప్టెన్, ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించేవారు. అయితే ఇకపై మరో కొత్త నిబంధనను జట్టు భరించాల్సి ఉంటుంది. ఫీల్డింగ్‌ చేసే జట్టు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతిని నిర్దేశిత సమయానికే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలా వేయకపోతే ఆ తర్వాత ఎన్ని ఓవర్లు (లేదా బంతులు) మిగిలినా.. 30 అడుగుల సర్కిల్‌ వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది.
అంటే సాధారణంగా ఐదుగురు ఫీల్డర్ల బదులు నలుగురిని మాత్రమే 30 యార్డ్ సర్కిల్ అవతల అనుమతిస్తారు. ఇన్నింగ్స్ మొదలయ్యే సయమంలో ఫీల్డ్ అంపైర్.. ఫీల్డింగ్ సైడ్తో పాటు బ్యాటింగ్ సైడ్ కెప్టెన్లకు షెడ్యూల్ సమయాన్ని వివరిస్తారు. అలాగే...  ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ ఇకపై టీ20 క్రికెట్‌లో డ్రింక్స్‌ విరామ సమయాల్లో ఐసీసీ కొత్త సడలింపు ఇచ్చింది. టోర్నీ ప్రారంభానికి ముందే ఇరు జట్ల అంగీకారం మేరకే ఇన్నింగ్స్‌ మధ్యలో ఆప్షనల్‌ డ్రింక్స్‌ బ్రేక్‌గా రెండున్నర నిమిషాలు విరామం తీసుకునే వీలు కల్పించింది.జనవరి 16న వెస్టిండీస్-ఐర్లాండ్ మధ్య జరగబోయే మొదటి టీ20తో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య జనవరి 18 నుంచి జరగబోయే టీ20 సిరీస్ నుంచి మహిళల టీ20ల్లోనూ ఈ నిబంధనలు అమలు చేయనున్నారు.
ఎల్బీడబ్ల్యూ డీఆర్ఎస్.. ఐసీసీ 2021 ఏప్రిల్‌లో ఐసీసీ దీనికి మార్పులు చేసింది. బంతిలో 50 శాతం బెయిల్స్‌కు తగిలినప్పుడు దాన్ని ఎల్బీడబ్ల్యూగా పరిగణించాలని ఐసీసీ ఇప్ప‌టికే నిర్ణయించింది. పాత రూల్ ప్రకారం.. బంతి బెయిల్స్‌కు తగిలినా.. అది అంపైర్స్ కాల్‌గానే పరిగణించేవారు. ఈ చిన్న టెక్నికల్ మార్పు బౌలర్లకు వరంగా మారింది. ఎక్కువ‌గా బ్యాటింగ్ ఫేవ‌ర్‌గా మారుతున్న టీ20లో బౌల‌ర్ల‌కు అవ‌కాశాలు క‌ల్పించేలా ఈ రూల్ ఉంద‌ని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: