కోహ్లీ కి మరో షాక్.. అతడు జట్టుకు దూరం?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐపీఎల్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు.  అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి బిసిసిఐ ఐపీఎల్ ప్రారంభించింది. కానీ కరోనా వైరస్ బిసిసిఐకి ఊహించని షాక్ ఇచ్చింది. బయో బబుల్ లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడం తో ఇక చివరికి ఐపీఎల్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా సగం ఐపీఎల్ మిగిలి ఉంది. అయితే రెండో దశ ఐపీఎల్ ని యూఏఈ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయించింది బీసీసీఐ. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూలు కూడా ప్రకటించారూ.



 అయితే ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి దశ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించారు.  ఇక ప్రస్తుతం అందరూ స్టార్ ఆటగాళ్లతో ఎంతో బలంగా జట్టు మారిపోయింది. దీంతో ఈసారి కోహ్లీ సేన టైటిల్ గెలవడం ఖాయం అని అనుకున్నారు. కానీ రెండవ దశ ఐపీఎల్ లో మాత్రం కోహ్లీసేన కు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు రెండవ దశ ఐపీఎల్కు దూరం అవుతూ వస్తూ ఉండటం గమనార్హం.  ఇప్పటికే జిల్లాలోని పలువురు కీలక ఆటగాళ్లు వివిధ అంతర్జాతీయ మ్యాచుల కారణంగా ఐపీఎల్ రెండవ దశలో కోహ్లీ  జట్టుకు దూరం కావడంతో వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇలా అటు విరాట్ కోహ్లీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్ సి బి జట్టుకు మరో షాక్ తగిలింది అని అర్థమవుతుంది  ఐపీఎల్ రెండో సీజన్కు ముందు ఇక జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కేసు వాషింగ్టన్ సుందర్ దూరం కాబోతున్నాడట. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ సుందర్ కి చేతి వేలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా అనుకోలేదు. దీంతో ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశదీప్ ని జట్టు యాజమాన్యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: