మీ తలరాత ఎలా ఉందో తెలుసుకోవాలనుందా...?

VAMSI
మనము ఎన్నో వేళ్ళ సంవత్సరాలుగా విశ్వసిస్తూ నమ్ముతూ వస్తున్న హిందూ పురాణాలు ప్రకారం ఈ తరం వాళ్ళు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరికీ బ్రహ్మదేవుడు పుట్టిన వెంటనే వారి నుదుటిపై కొన్ని రాతలు రాస్తాడు. ఈ విధంగా రాసిన రాతలే మన భవిష్యత్తు అని మీకు తెలుసా. అంతే కాకుండా ఈ విధంగా రాసిన రాతలను మార్చాలంటే ఇవి గీసిన బ్రహ్మకు కూడా సాధ్యం కాదట. వీటిని మార్చడం మన ప్రాణాలను హరించే యముడికి సాధ్యమట. ఆయనకే మన తలరాతకు సంబంధించిన పూర్తి హక్కులు ఉంటాయట.  ఇదంతా ఇలా ఉంటే మనిషి అన్నాక ఎన్నో సందేహాలు ఉంటాయి. మనకు మంచి పనులు జరిగినా లేదా అశుభాలు జరిగినా అంతా మన తలరాత ప్రకారమే జరుగుతాయని నమ్ముతుంటారు. అయితే ఆ తలరాతలకు.. మన జీవిత కాలానికి ఉన్న ఆసక్తికరమైన సంబంధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గత సంవత్సరమంతా కరోనా శాపముతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ప్రస్తుతం దాని ప్రభావం తగ్గినప్పటికీ సెకండ్ వేవ్ పేరుతో మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు మన తలరాతకు మరియు ఫ్యూచర్ కు కూడా లింక్ ఉందని.. అందుకోసం మీరు అద్దంలో మీ తలను చూసుకుంటే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మీరు అద్దంలో నుదుటిని చూసుకున్నప్పుడు, ఒక్క గీత మాత్రమే కనిపిస్తే మీరు కనీసం 20 సంవత్సరాలు బ్రతుకుతారట. అలా కాకుండా రెండు గీతలు కనుక చెరో వైపుకు వెళ్లినట్లు ఉంటే అలాంటి వారు కేవలం ఒక్క సంవత్సరమే బ్రతుకుతారని అర్ధం.  కానీ ఆ గీతలు 3 ఉంటే సుమారుగా 40 సంవత్సరాలు జీవిస్తారని నమ్మకం.
మరియు మీ నుదుటిపై 2 పెద్ద గీతలుంటే.. మీరు సుమారు 70 ఏళ్లకు పైగా జీవిస్తారట. అదే విధంగా మూడు పెద్ద గీతలుంటే మీరు కచ్చితంగా షష్టి పూర్తి చేసుకుంటారని అర్థమట. ఒకవేళ మీ నుదుటిపై గీతలు కొన్ని స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా ఉంటే.. అలాంటి వారంతా కచ్చితంగా 40 ఏళ్ల వరకు జీవిస్తారట. మీ నుదుటిపై గీతలన్నీ రౌండ్ గా ఉంటే.. మీరు ఎంత సంపాదించినా.. ఆ సొమ్మునంతా ఖర్చు పెట్టడం లేదా కోల్పోవడమో జరుగుతుందట. కొందరికి నుదుటిపై ఎంత చూసుకున్నా గీతలనేవి అస్సలు కనిపించవు. అయితే అలాంటి వారు కచ్చితంగా 40 ఏళ్ల వరకు బతుకుతారట. మాములుగా ఇవి శాస్త్రం ప్రకారం నిర్ణయించబడినవి. వీటిని నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మన ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: