శ్రావణ మాసం

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం" 


చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం.  ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. 


శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం. 


పాడ్యమి - బ్రహ్మదేవుడు
 విదియ - శ్రీయఃపతి 
 తదియ - పార్వతీదేవి
 చవితి - వినాయకుడు
 పంచమి - శశి
 షష్టి - నాగదేవతలు
 సప్తమి - సూర్యుడు
 అష్టమి - దుర్గాదేవి
 నవమి - మాతృదేవతలు
 దశమి - ధర్మరాజు
 ఏకాదశి - మహర్షులు
 ద్వాదశి - శ్రీమహావిష్ణువు
 త్రయోదశి - అనంగుడు
 చతుర్దశి - పరమశివుడు
 పూర్ణిమ - పితృదేవతలు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: