మంచిమాట : మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు..!

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో, ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకు వస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు..!

దీని అర్థం ఏమిటంటే.. మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ ముందుగా మనమేంటో, మనలో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకోగలగాలి.. అప్పుడే అన్నిటికన్నా పెద్ద చదువులు చదివిన వాళ్ళం అవుతాము. మన గురించి మనకు ఏమీ తెలియకుండా, ఎంత చేసినా, ఎంత చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ముందు మనం ఎలాంటి వారము, మన ప్రవర్తన ఏమిటి..మనం అందరిలో ఎలా మసలుకుంటున్నామో.. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో..ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే ఏమి చదవకపోయినా పెద్ద చదువులు చదివిన అంత ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా మనం కేవలం చదువు మాత్రమే చదివి, దానిలోని అర్థం తెలుసుకోలేకపోతే మాత్రం  మన జీవితమే వృధా అవుతుంది..

అందుకే సమాజంలో ఎలా బ్రతకాలో కూడా తెలిసి ఉండాలి. ఎదుటివారిని వేలెత్తి చూపించేటప్పుడు, మనవైపు 4 వేళ్లు చూస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఎదుటి వారి లోపాలను చూపించడం మానేస్తాము. అందరితో సుఖసంతోషాలతో మసులుతూ ఆనందంగా జీవించగలుగుతాము. ఎప్పటికీ ఎదుటివారిలో లోపాలను వేలెత్తి చూపించకూడదని. వీలైతే ఆ లోపాలను సవరించడానికి మాత్రమే ఆలోచించాలే తప్పా వారిని దూషించకూడదు.. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం చదివిన చదువులు ఎప్పటికీ వృధా అవ్వవు.ఇక  ఈ విషయాలను నేర్చుకుంటే  జీవితాన్ని చదివినట్టు లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: