మీ గుండె ఆరోగ్యంగానే ఉందా..? ఈ 5 సంకేతాలతో ఇట్టే తెలుసుకోవచ్చు..!

lakhmi saranya
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం గుండె... ఇది శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయడానికి పనిచేస్తుంది. గుండె ఆరోగ్యం మనం మొత్తం ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈరోజుల్లో గుండెపోటు, హైబీపీ, గుండె జబ్బులు వంటి గుండె సంబంధిత వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో, గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు మనం కొన్ని లక్షణాలు కనిపించినా... గుండె ఆరోగ్యాన్ని విస్మరిస్తాము. కొన్ని లక్షణాలను గుర్తించడం ద్వారా... సకాలంలో చికిత్స పొంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
అటువంటి పరిస్థితిలో గుండె జబ్బులు రాకముందే. ఎప్పటికప్పుడు హృదయం ఆరోగ్యాన్ని తనకి చేసుకోవటం మంచిది. అయితే, ఆరోగ్యవంతమైన గుండె సంకేతాలు ఏంటో మీకు తెలిస్తే, మీ ఆరోగ్యాన్ని సమయానికి జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ కథనంలో మీ గుండె ఆరోగ్యాన్ని సూచించే 5 ప్రధాన సంకేతాల గురించి మేము మీకు చెబుతున్నాను... అవేంటో తెలుసుకో. నిపుణుల అభిప్రాయం ప్రకారం..గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. సాధారణ హృదయ స్పందన ఆరోగ్యకరమైన గుండెకు సంకేతం. ఆరోగ్యకరమైన గుండె సాధారణంగా నిమిషానికి 60-100 బీట్స్ మధ్య కొట్టుకుంటుంది. మీ హృదయ  స్పందన అసాధారణంగా లేదా చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా ఉండే, అది గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. రక్తపోటు సాధారణ స్థాయి ఆరోగ్యకరమైన గుండెకు సంకేతం.
 ఆరోగ్యవంతమైన వ్యక్తి bp 120/80 mmhg గా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, bp నిరంతరం ఎక్కువగా ఉండే ... లేదా తక్కువ ఉంటే, అది గుండె ఆరోగ్యానికి ప్రమాద ఘంటిక గా ఉంటుంది. హాయ్ బిపి గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు చురుగ్గా నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి తేరికపాటి శారీరక శ్రమ చేసినప్పుడు, మీరు అలసిపోకుండా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడకుండదు. మీరు సాధారణ కార్యకర్తలలో కూడా అలసిపోయినట్లు, ఊపిరి పీల్చడం లేదా తల తిరగటం వంటి అనుభూతిని కలిగి ఉంటే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: