మంత్రి నారా లోకేష్‌తో 11 ఏళ్ల టెక్ పిడుగు.. ఎవరా అఖిల్ .. !
- ఇచ్చిన మాట ప్రకారం కలిసిన లోకేష్ .. !
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలెంట్ ఎక్కడ ఉన్నా .. ఎవరి లో ఉన్నా ప్రోత్సహించడం లో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందు వరుస లో ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అలాగే లోకేష్ విద్యా శాఖా మంత్రి గా బాధ్యతలు స్వీకరించాక ఏపీలో విద్యా రంగంలో ఎన్నో సంస్కరణ లు తీసుకు వస్తున్నారు .. ఎన్నో సంస్కరణలు అమలు అయ్యేలా కష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఇంటర్ విద్య లో సమూళ ప్రక్షాళన చేయడం తో పాటు ఎన్నో విధాలు గా సరికొత్త మార్పులు .. చేర్పులు తీసుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రి తో కలిసి మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.
యూకేలో విద్య ను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్.. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ రంగం లో ఎన్నో మైలురాళ్ల ను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించి న అజ్యూర్ , డేటా , సెక్యూరిటీ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేష న్ కోర్సు ల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకే లో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ ల లో పాల్గొన్నాడు. అమరావతి లో జరగనున్న సమాచార , సాంకేతిక అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలో నే కలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. భవిష్యత్తు లో అఖిల్ మరింత గా దూసుకు వెళ్లాలని .. తాను ఎంచుకున్న రంగం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కూడా మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.