
మంత్రి నారా లోకేష్ ఒక్క మెసేజ్‌తో ఒకరికి ప్రాణదానం...!
- అవయవ దానం చేయాలని డిసైడ్ అయిన కుటుంబ సభ్యులు
- నారా లోకేష్‌కు మెసేజ్ .. క్షణాల్లో స్పందించిన మంత్రి
- గుంటూరు టు తిరుపతి వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయించిన లోకేష్
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో .. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా , గ్రీన్ ఛానల్‌కు మార్గం సుగమం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయం లోకి వెళితే గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఇప్పటి వరకు సుష్మ బతుకు తుందని ఆ కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలు నెరవేరే లా కనపడడం లేదు. వారు కూడా తమ బిడ్డ బతుకుందన్న ఆశలు వది లేసుకున్నా రు. అయితే తమ బిడ్డ అవయవా లతో మరొకరికి ప్రాణదానం చేయాలని .. అలాగైనా తమ బిడ్డను వారిలో చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.
ఈ క్రమంలో నే జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవదానానికి అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాల పై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణ దానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసిన వెంట నే క్షణాల్లో స్పందించిన మంత్రి నారా లోకేష్ గుండె తరలింపున కు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం తో పాటు . . . తిరుపతి ఆస్పత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చు తో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడం తో .. ఆ పని సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.