వైసీపీకి ఎదురు దెబ్బ.. జగన్ బంధువు మృతి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ... కూటమి ప్రభుత్వంలో అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువైన అభిషేక్ రెడ్డి... తాజాగా మరణించారు. బ్రెయిన్ డెడ్ కావడంతో... అభిషేక్ రెడ్డి మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

బ్రెయిన్ డెడ్ తో గత మూడు నెలలుగా కోమాలోనే ఉన్నాడట వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అభిషేక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రిలో అతనికి చికిత్స కూడా అందించారు. బ్రెయిన్ డెడ్ కావడంతో గత మూడు నెలలుగా ఆ ఆసుపత్రిలోనే వైద్యం అందించారట. కానీ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అభిషేక్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడలేదని సమాచారం. ఆయన ఆరోగ్యం ఇవ్వాళ మరింత క్షీణించిపోయిందట. దీంతో... జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అభిషేక్ రెడ్డి ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైసిపి నేతలు అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

 జగన్మోహన్ రెడ్డి బంధువు అభిషేక్ రెడ్డి మరణించడంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అందరూ శోకసంద్రం లోకి వెళ్లిపోయారు.  వాసవంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో... వైసీపీ పార్టీ గెలవడం కోసం చాలా కష్టపడ్డారు అభిషేక్ రెడ్డి.  కడప జిల్లాలో వైసీపీ పార్టీ... 2019లో అఖండ విజయం సాధించడం వెనుక అభిషేక్ రెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన కారణంగానే కడప జిల్లాలో వైసీపీ పార్టీ దుమ్ము లేపింది.


ఇది ఇలా ఉండగా బెంగళూరు నగరంలోనే తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి బంధువు అభిషేక్ రెడ్డి.  ఆ తర్వాత ఖమ్మంలో తన ఎంబిబిఎస్ చదువును పూర్తి చేసుకున్నాడు అభిషేక్ రెడ్డి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యాధి బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మరణించారు. అభిషేక్ రెడ్డి మరణం వార్త వినగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతికి గురయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: