జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ రీతూ చౌద‌రికి పెళ్లై విడాకులు అయ్యాయా? బ‌య‌ట‌పడ్డ షాకింగ్ నిజాలు

MADDIBOINA AJAY KUMAR
రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచ‌యం అక్కర్లేని పేరు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన రీతూ చౌదరి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ తర్వాత పలు టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా టీవీ షోలకంటే రీతూ చౌదరి సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మందికి దగ్గర అయింది. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ యువతను తన వైపు తిప్పుకుంది. పొట్టి పొట్టి డ్రెస్ లతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. ముఖ్యంగా ఈ అమ్మ‌డు చీర క‌ట్టి అందాలు ఆర‌బోసిందంటే లైకులు కామెంట్లు వ‌చ్చి ప‌డాల్సిందే. అలా ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు.
అయితే ఇటీవల ఈ బ్యూటీ పేరు ఓ వివాదంలో బయటకు వచ్చింది. కొన్ని కోట్ల రూపాయల స్కాంలో రీతూ చౌదరి పేరు వినిపించడం సంచలనంగా మారింది. దీంతో పాటు తాజాగా మరికొన్ని ఆసక్తికర విషయాలు వార్తల్లో చెక్కర్లు కొడుతున్నాయి. రీతూ చౌదరి అసలు పేరు వ‌నం దివ్య అని తెలుస్తోంది. ల్యాండ్ స్కామ్ లో పేరు బయటకు వచ్చిన సమయంలో కూడా వ‌నం దివ్య పేరుతోనే కేసు నమోదు అయింది. అంతేకాకుండా రీతూ చౌదరికి గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో పెళ్లి జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.
అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతడికి విడాకుల నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. కానీ విడాకులు అయ్యాయా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. ఇక ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. గతంలో మాత్రం రీతూ చౌద‌రి... జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోవద్దు అంటూ కామెంట్లు చేయడం ఆశ్చర్యకరం. కానీ ఇప్పుడు ఆ బ్యూటీనే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంద‌ని వార్త‌లు రావ‌డంతో అప్పుడు లాంటి కామెంట్లు చేయ‌డానికి కార‌ణం విడాకులేనేమో అనే అన్న అనుమానాలు కూడా మొద‌ల‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: