మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించడం కోసం ఎన్నో ఇబ్బందులు పడి మరెన్నో సాహసాలు చేసి తన నటనతో స్టార్ అయ్యారు. మెగాస్టార్ అవ్వడం అంటే అంతా తేలిక కాదు.ఆయన సినిమాల విషయంలో ఎంతో డెడికేషన్ గా వ్యవహరించి చివరికి తన కృషి పట్టుదల తో అనుకున్నది సాధించాడు. అయితే అలాంటి మెగాస్టార్ మీద ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. అలాంటి రూమర్లలో ఇది కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఆ స్వామీజీ వల్లే మెగాస్టార్ అయ్యారా అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ స్వామీజీ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కేవలం ఆయన నటన డేడికేషన్ మాత్రమే కారణం. కానీ కొంతమంది మాత్రం ఇంకా వేరే వేరే అంశాలు తెరమీదకి తీసుకువస్తూ ఉంటారు.
అయితే చిరంజీవి గురించి గతంలో ఒక పేపర్ యాడ్ వాళ్ళు పేపర్ కి గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో ఒక మందు బ్రాండ్ ని పెట్టి ఆ పక్కనే మెగాస్టార్ దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు పేపర్ ప్రింట్ చేశారు.అయితే ఈ పేపర్ ప్రింట్ కాస్త చిరంజీవి దాకా వెళ్లడంతో ఎందుకు ఇలాంటి నీచమైన పని చేశారు ఇది చూస్తే నేనే ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాను కావచ్చు అనుకుంటారు. వెంటనే దాన్ని తొలగించండి అని వార్నింగ్ ఇచ్చారట.ఆ తర్వాత కొద్ది రోజులకు మరో పేపర్ లో చిరంజీవి ఫోటో వేసి చిరంజీవి ఫోటో మీద ఒక బాబా ఫోటో వేసారట. అయితే చూడ్డానికి ఆ బాబా చిరంజీవిని దీవిస్తున్నట్టు కనిపిస్తుంది.
అయితే పేపర్లో వేసిన ఈ ఫోటో కూడా చిరంజీవి కి తెలియడంతో ఆ పేపర్ వాళ్ళని పిలిచి నేను ఎవరి దీవెనలతోనో పైకి రాలేదు.కేవలం నా హార్డ్ వర్క్, డెడికేషన్, నటనతోనే ఇండస్ట్రీలో స్టార్ అయ్యాను.కానీ మీరు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి యాడ్స్ ఇచ్చి మీ పేపర్ వ్యాల్యూ పెంచుకోవాలని ఇలా దిగజారకండి అని వార్నింగ్ ఇచ్చారట.అయితే ఆ పేపర్లో ఆ బాబా చిరంజీవిని దీవిస్తున్నట్టు ఉండడంతో చాలామంది ఆ బాబా వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారా ఏంటి అని మాట్లాడుకున్నారట చాలామంది.