గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో-హీరోయిన్..మహేశ్-నమ్రత బ్లెసింగ్స్..!?
ఇలాంటి పరిస్థితే తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట విషయంలోనూ కనిపిస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ, ఆ పెళ్లికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి హాజరయ్యారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మొదట చూసిన వారికి అవి నిజమేనేమో అనిపించేలా ఉన్నప్పటికీ, గమనిస్తే అవన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.ఇటీవల ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారన్న ప్రచారం కూడా టాలీవుడ్లో జోరుగా సాగింది. అయితే ఆ నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా ఎక్కడా కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘ఎప్పుడు కలిసి కనిపిస్తారు?’, ‘నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందా?’ అంటూ సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్లో అత్యంత పాపులర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్నట్లు చూపిస్తూ కొందరు ఫ్యాన్స్ ఏఐ సహాయంతో ప్రత్యేకంగా ఫోటోలను క్రియేట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ చిత్రాల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగినట్లు, పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరైనట్లు చూపించారు. అంతేకాదు, వారిని ఆశీర్వదించేందుకు మహేష్ బాబు – నమ్రత దంపతులు వచ్చినట్లు కూడా ఆ ఫోటోల్లో కనిపిస్తోంది.అయితే ఇవన్నీ పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఫోటోలేనని నెటిజన్లు స్పష్టంగా గుర్తిస్తున్నారు. ‘ఇవి ఫేక్ ఫోటోలు అయినా క్యూట్ కపుల్’, ‘ఏఐ మహిమ ఇదే’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వల్ల లేనివి కూడా ఉన్నట్లుగా చూపించడం ఇప్పుడు చాలా సులభంగా మారిపోయింది. అందుకే సెలబ్రిటీ న్యూస్ విషయంలోనైనా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోల విషయంలోనైనా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారిక ప్రకటనలు లేకుండా వచ్చే వార్తలను పూర్తిగా నమ్మకుండా, నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే స్పందించడం ఈ ఏఐ యుగంలో చాలా అవసరం.