టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి తో చేయబోతున్నట్లు ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. దానితో పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ పూర్తి కాగానే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో సినిమాను స్టార్ట్ చేస్తాడు అనే కూడా చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా సురేందర్ రెడ్డి , పవన్ కళ్యాణ్ తో కాకుండా మరో హీరోతో సినిమాను సెట్ చేసుకున్నట్లు , ప్రస్తుతం ఆయన ఆ హీరో కు సంబంధించిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ హీరో గా సురేందర్ రెడ్డి ఓ సినిమాను చేయాలి అని చూస్తున్నట్లు , వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందిస్తున్నట్లు ప్రస్తుతం వక్కంతం వంశీ , సురేందర్ రెడ్డి ఇద్దరు కలిసి రవితేజ కోసం ఓ కథను రెడీ చేస్తున్నట్లు మరి కొన్ని రోజుల్లోనే దానిని రవితేజ కు వినిపించనున్నట్లు అన్ని ఓకే అయితే రవితేజ , సురేందర్ రెడ్డి , వక్కంతం వంశీ కాంబో లో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గతం లో రవితేజ , సురేందర్ రెడ్డి , వక్కంతం వంశీ కాంబోలో కిక్ , కిక్ 2 అనే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో కిక్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా కిక్ 2 మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురి కాంబో లో మూడవ సినిమా ప్రారంభం కాబోతున్నారు ఓ వార్త వైరల్ అవుతుంది.