దొంగలుగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరో..స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా..?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు స్టార్స్. అందులో టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా జాయిన్ అయిపోయారు. వీళ్లిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అడివి శేష్ సినిమాలంటేనే కంటెంట్‌కు ప్రాధాన్యం ఉంటుందనే నమ్మకం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఆయనపై నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.



ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర కథలో కీలక మలుపులు తీసుకురాబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా  ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ టీజర్‌లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టైలిష్ ప్రెజెంటేషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.



ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ దొంగల పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు  ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ముఖాలకు మాస్కులు ధరించి, కారుపై కూర్చుని దొంగల గెటప్‌లో స్టైలిష్‌గా ఫోజులు ఇస్తూ కనిపించారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నెటిజన్లు ఈ స్టిల్స్‌పై క్రేజీ కామెంట్స్ చేస్తూ, వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కొంతమంది అయితే ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇవన్నీ కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసిన స్ట్రాటజీ అని తెలుస్తోంది. ప్రమోషన్స్ పరంగా కూడా ‘డెకాయిట్’ మూవీ చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని టాక్.



మొత్తానికి, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌, కొత్త దర్శకుడి విజన్‌, భారీ బడ్జెట్‌, పాన్ ఇండియా రేంజ్—అన్ని  కలిసి ‘డెకాయిట్’ సినిమాను 2025లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్‌లో నిలిపాయి. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: