ఫుట్‌బాల్ ప్లేయర్‌గా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ – రోషన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఈ మూవీ ఏనా...!
తన కెరీర్‌లో ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ రోషన్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. "చాలా మందికి నేను సులభంగా అవకాశాలు పొందుతున్నానని అనిపించవచ్చు. కానీ, ప్రతి సినిమా నాకు ఒక పరీక్షే. ఈ సినిమా కోసం మేము రెండేళ్లు కష్టపడ్డాం. ఇది కేవలం ఒక సినిమా కాదు, నా నమ్మకం" అంటూ కళ్ళు చెమ్మగిల్లినంత పనిచేశారు.
తన తండ్రి శ్రీకాంత్ ఎప్పుడూ తనకు వెన్నుముకగా ఉంటారని, ఆయన కష్టాన్ని చూస్తూనే తాను పెరిగానని, ఆయన పేరు నిలబెట్టేలా కష్టపడతానని రోషన్ ఎమోషనల్‌గా చెప్పారు.ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే భారీ వ్యూస్ సాధిస్తోంది. రోషన్ ఈ సినిమాలో ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం రోషన్ తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. ట్రైలర్‌లో ఆయన చూపించిన ఎనర్జీ, ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడి జీవితంలోని గెలుపోటములు, రాజకీయాలు మరియు ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రోషన్ మేకాకు ఈ సినిమా విజయం చాలా కీలకం. 'పెళ్లి సందడి' సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా, నటుడిగా రోషన్‌కు పెద్దగా పేరు తీసుకురాలేదు. అందుకే ఈసారి ఒక ఛాలెంజింగ్ రోల్‌తో తనలోని నటుడిని నిరూపించుకోవాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే, సినిమా కోసం ఆయన ఎంతగా ప్రాణం పెట్టారో అర్థమవుతోంది.వారసుల మీద ఎప్పుడూ ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. రోషన్ ఆ ఒత్తిడిని స్వీకరిస్తూనే, తన ప్రతిభతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. 'ఛాంపియన్' చిత్రంతో ఆయన బాక్సాఫీస్ వద్ద నిజమైన ఛాంపియన్‌గా నిలుస్తారో లేదో చూడాలి.