ఆ విషయంలో "రామ్"ని మెచ్చుకోకుండా ఉండలేము.. ఈసారైనా మంచి ఫలితం దక్కెనా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు ఎన్ని ప్లాప్ లు వచ్చినా కూడా ఒకే రకమైన సినిమాలు చేస్తూ వెళుతుంటారు. దానితో ప్రేక్షకులు కూడా అలాంటి హీరోల విషయంలో ఆ హీరోకి మంచి టాలెంట్ ఉంది. అద్భుతమైన క్రేజ్ ఉంది. కానీ ఒకే రకమైన జోనర్ సినిమాలు చేయడం ద్వారా అతనికి హిట్లు దక్కడం లేదు. ఆయన జోనర్ మారిస్తే మంచి విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజీ హీరోగా కెరియర్ను కొనసాగిస్తాడు అని కొంత మంది విషయంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అలా అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత కొంత మంది హీరోలు మారి తాము ప్రస్తుతం చేస్తున్న జోనర్ నుండి వేరే జోనర్ కు షిఫ్ట్ అయ్యి సినిమాలు చేస్తుంటారు. ఇకపోతే అలాంటి హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన గత కొంత కాలంగా వరుస పెట్టి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఈ జోనర్ సినిమాలలో రామ్ కి చాలా అపజయాలు వరుసగా దక్కాయి.


దానితో చాలా మంది రామ్ రొటీన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో కాకుండా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తే మంచి విజయాలను అందుకుంటాడు అని అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో రామ్ తన పందా మార్చి కొంత కాలం క్రితం ఆంధ్ర కింగ్ తాలూకా అనే క్లాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లను ఈ సినిమా వసూలు చేయలేక పోయింది. ఇకపోతే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా రామ్ మళ్లీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో నటించకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. రామ్ తన నెక్స్ట్ మూవీ ని ఇప్పటికే సెట్ చేసుకున్నట్లు , అది హర్రర్ జోనర్ మూవీ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి హర్రర్ జోనర్ మూవీ తో రామ్ మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: