మూవీ లవర్స్ కు షాక్.. తెలంగాణలోనూ టికెట్ ధరల పెంపు..రేపు జీవో విడుదల?
గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో కోసం జనవరి 10న ఏకంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ఎర్లీ మార్నింగ్ షోలకు సైతం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల విషయానికి వస్తే మల్టీ ప్లెక్స్ లో రూ.175 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ ధరలు కొనసాగనున్నాయి. అంతే కాకుండా 11వ తేదీ నుండి ప్రతిరోజూ 5 షోలు ప్రసారం చేసేందుకు అనుమతి ఇచ్చింది. 23 తరవాత సాధారణ ధరలతో నాలుగు షోలు ప్రసారం చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఇప్పుడు స్పెషల్ జీవో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మాధిరిగా స్పెషల్ జీవో తీసుకువచ్చేలా ప్రభుత్వ పెద్దలతో దిల్ రాజు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు టికెట్ ధరలకు సంబంధించి జీవో కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పుష్ప 2 బెనిఫిట్ షో ఘటన తరవాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్పెషల్ షోలు రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.