కావ్య థాపర్ : ఈ బ్యూటీకీ ఏమైపోయింది .. ఎక్కడ అడ్రస్ ఏ లేదు..!
గత సంవత్సరం ఈమె హవా గట్టి గా కనిపించింది .. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది .. అయితే అందులో హిట్ అయింది .. మాత్రం ఒకే ఒక్క సినిమా మాత్రమే .. మిగిలిన మూడు సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి .. రవితేజ తో కలిసి చేసిన ఈగల్ , హీరో రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ , గోపీచంద్ తో చేసిన విశ్వం సినిమాలు ప్లాప్ అవడం తో కావ్య థాపర్ కెరియర్ మరింత గడ్డు పరిస్థితుల్లో పడింది .. ఇక దీంతో ఈ యాడాది ఇప్పటి వరకు ఈమె బోనీ కొట్టలేదు ..
ఇక గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ హీరోయిన్ వరుస విహార యాత్ర లోనే గడుపుతుంది .. ఖాళీ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది .. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కజకిస్తాన్ మంచు కొండల్లో వివరిస్తుంది .. అందుకు సంబంధించిన ఫోటోల ను కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ చేస్తుంది . ఇక మరి రాబోయే రోజుల్లో అయినా ఈ హీరోయిన్ కు సరైన అవకాశం వచ్చి హిట్ వస్తుందో లేదో చూడాలి .