40 ఏళ్ల తర్వాత మహిళలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి... నిర్లక్ష్యం వద్దు!

lakhmi saranya
అందుకే హార్మోన్ల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ... వైద్యుల సూచనలు పాటిస్తుండాలి. ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లు తినటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత మహిళలు ఈ టెస్టులు కచ్చితంగా చేయించుకోవాలి. ఇంటి పని, ఆఫీసు బాధ్యతలతో ఆడవారు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపరు. కానీ, 40 తర్వాత మహిళలు తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే 40 తర్వాత మహిళల్లో సంభవించే అనేక మార్పులు శారీరక,
మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, అలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలో మహిళలు ఎముకల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతి నుంచి ఎముకల ఆరోగ్యం విషయంలో మహిళలు ఎక్కువగా శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ సమస్యలు చాలా మందిలో ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతు బోలు ఏమో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరం. 35 దాటిన ప్రతి మహిళ ఎముక సాంద్రత పరీక్ష చేసుకోవాలి.
40 లకు చేరాక ఎముకల దృఢత్వం పై మహిళలు అధిక శ్రద్ధ తీసుకోవాలి. అందుకు అవసరమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను మహిళలు ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం వల్ల ఎముకల బలం, సాంద్రత పెరుగుతాయి. పాలు, పాల ఉత్పత్తులు, చాపలు, సోయా బీన్స్, నట్స్ లాంటి వాటిల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. 40 ల వయసులోకి వచ్చాక మహిళలు తప్పనిసరిగా ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఎముకల పరిస్థితి ఎలా ఉందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనివల్ల, ఎముకలు డామేజ్ అయ్యే ఆస్టియోపోరోసిస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మహిళలు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా వెయిట్ డ్రైనింగ్ చేయటం మంచిని చెబుతున్నారు. వ్యాయామం వల్ల ఎముకలు దృఢత్వం మెరుగ్గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: