అనుష్క.. కాజల్.. సమంత ఓ విషయంలో ముగ్గురు సేమ్.. అదేంటో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారిలో అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంత కూడా ఉంటారు. వీరు ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లుగా తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో ఒకే తాటిపై నడుస్తున్నారు. అదేమిటి అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ వరుస పెట్టి ఐటమ్ సాంగ్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే అనుష్క , కాజల్ , సమంత కూడా ఇప్పటికే వీరి కెరీర్లో స్పెషల్ సాంగ్ లు చేశారు.

కానీ వీరు కేవలం ఒకే ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అనుష్క చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. దీని ద్వారా అనుష్క కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ సాంగ్ తర్వాత ఇప్పటివరకు అనుష్క ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇక కాజల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఈ సాంగ్ తర్వాత కాజల్ ఇప్పటివరకు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు.

ఇకపోతే సమంత కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్న సమంత ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు స్పెషల్ సాంగ్స్ ద్వారా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆ తర్వాత మళ్లీ స్పెషల్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: