మంచిమాట: భయంతో ఉన్నవాళ్లు.. ఏది సాధించలేరు!

Durga Writes

నేటి మంచి మాట.. భయంతో ఉన్నవాళ్లు.. ఏది సాధించలేరు. ఈ మాటను చెప్పింది మరెవరో కాదు.. రవీంద్రనాధ్ ఠాగూర్ చెప్పారు. అవును.. నువ్వు గెలుస్తావో.. ఓడిపోతావో తెలియదు.. అంతమాత్రాన.. ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో వెనకడుగు వేస్తావా? ఒకవేళ నీకు ఆ భయమే లేకపోతే.. నువ్వు ముందు అడుగు వేసి వెళ్లవు అంటే గెలుస్తావు ఏమో. అప్పుడు వచ్చే అభినందనలను చూడు. 

 

అంతేకాని భయంతో వెనకడుగు వేసి.. ఓటమితో వచ్చే అవమానాలను చూసి భయపడితే నీకు జీవితం ఎక్కడ ఉంటుంది. అసలు ఒకసారి ఓడిపోతేనే కదా లోకం అంటే ఏంటో తెలిసేది.. ఓడిపోతేనే కదా అవమానాలు జరిగేది.. ఆ అవమానాలు నీకు పాఠాలు నేర్పేది.. ఓటమి నీ జీవితంలో లేదు అంటే.. నువ్వు ఏది నీకంటే ఎక్కువ దాన్ని కోరుకోలేదు అని అర్ధం. 

 

నీకు వచ్చే దానిలో నువ్వు గెలిస్తే ఎంత.. గెలవకపోతే ఎంత.. అవును.. మనం ఎంత ఉంటె అంతే కాళ్ళు చాపుకోవాలి. కానీ నువ్వు ఉన్నత శిఖరాలకు చేరాలంటే నీకు చేతకానిదే చెయ్యాలి.. అప్పుడే నువ్వు ఏదైనా విజయం సాధించగలవు.. కానీ అలా సాధించాలంటే ముందు నీకు దైర్యం ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు.. అదే దైర్యం లేకుంటే.. చేయకుంటే.. పైన చెప్పిన సామెత మీకు సరిగ్గా సరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: