మీరు చీకట్లో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా!

lakhmi saranya
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. దీని మాయలో పడి పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి ఫోన్ చూస్తున్నారు. కొందరు చీకట్లో కూడా ఫోన్ వినియోగిస్తుంటారు. ఇది కంటి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చీకట్లో ఫోన్ తదేకంగా చూడటం వల్ల వీటి నుంచి వెలువాడే... చాలామంది ఉదయం నిద్ర లేవగానే చేసే మొదటి పని, రాత్రి నిద్రకు ముందు చేసే చివరి పని మొబైల్ ఫోన్ చూడటం. నేటి కాలంలో ఈ చర్య సర్వ సాధారణమైపోయింది.
 చీకట్లో మొబైల్ ఫోన్లను వాడే ట్రెండ్ రోజు రోజుకు పెరుగుతోంది. రోజువారి పనులు ముగిశాక, మొబైల్ ఫోన్ మీద కన్ను వెయ్యకపోతే చాలామందికి నిద్ర పట్టదు. నిజానికి, ఇలా రాత్రిపూట చీకట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇది కళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుందట. రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం, ఈ మెయిల్ చెక్ చేయటం, మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం దాదాపు సర్వసాధారణమైపోయింది. చీకట్లో ఫోన్ ని ఉపయోగించడం వల్ల కళ్ళపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. చీకట్లో ఫోన్ చూస్తున్నప్పుడు, ప్రకాశంవంతమైన కాంతి కళ్ళపై పడుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటమే కాకుండా మెదడు, నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.
 ఫోన్ వంటి ఇతర డిజిటల్ పరికరాల ద్వారా వెలువాడే నిలి కాంతి కళ్ళ రెటీనా పై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కంటి అలసట, డ్రై ఐ సిండ్రోమ్, దృష్టి క్షీణతకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిపూట లేటు లేకుండా చీకట్లో కూర్చుని ఉపయోగించటం సరికాదు. చీకట్లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఎక్కువ. ఇది కాకుండా తలనొప్పి, కంటి చికాకు కూడా సంభవించవచ్చు. ఇది కళ్ళకు మంచిది కాదు. ఫలితంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఫోన్ నుంచి వెలువాడే నీలి కాంతి నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్రలేమికి దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: