
రాత్రి బెడ్‌రూమ్‌లో ఇలా చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?
దోమలు కనిపించకుండా మాయం చేసే ఈ పరికరాలు.. మీ ఊపిరితిత్తుల్లోకి విషాన్ని నింపుతున్నాయని మీకు తెలుసా, వీటి నుంచి వెలువడే ఘాటైన రసాయనాలు మీ శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ వాసన మీ ముక్కు రంధ్రాల ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి, ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది.
ముఖ్యంగా పసిపిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. చిన్న పిల్లలు, మూగజీవాలు ఈ రసాయనాల ప్రభావానికి త్వరగా గురవుతాయని వైద్యులు చెబుతున్నారు. వారి సున్నితమైన శరీరం ఈ విషపూరిత రసాయనాలను తట్టుకోలేకపోతుంది. దీంతో వారికి శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ దోమల నివారణ పరికరాలు కేవలం దోమలనే కాదు.. మీ ఆరోగ్యాన్ని కూడా నిశ్శబ్దంగా చంపేస్తాయి. అందుకే వీటిని వాడటం మానేయమని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
మరి దోమలను తరిమికొట్టేదెలా, సహజమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వేప నూనె దీపాలు వెలిగించడం, దోమతెరలు వాడటం వంటివి ఉత్తమమైన ప్రత్యామ్నాయాలు. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ఇప్పటికైనా వీటిని వాడటం మానేయాలి. మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దోమల నివారణ పేరుతో విషాన్ని పీల్చడం ఆపేయండి. సహజ మార్గాలను ఎంచుకోండి.. ఆరోగ్యంగా జీవించండి. లేకపోతే తర్వాత అనేక ఇబ్బందులు తప్పవు.