ది రాజాసాబ్ మూవీ చరిత్ర తిరగరాస్తుందా.. ఆ స్థాయిలో కలెక్షన్లు తిరగరాస్తుందా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలను విడుదల చేయడానికి సంక్రాంతి సీజన్ బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేసింది. అయితే గతేడాది ఈ ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు మాత్రమే సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి.
2026 సంక్రాంతి రేసులో మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఏ సినిమా కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకేసారి ఏడు సినిమాలు థియేటర్లలో విడుదలైతే మాత్రం థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే పండుగ సమయంలో విడుదల చేస్తే యావరేజ్ టాక్ వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని భావించి హీరోలు, నిర్మాతలు సంక్రాంతి పండుగపై దృష్టి పెడుతున్నారు.
2026 సంక్రాంతి రేసులో నిలిచిన పెద్ద సినిమా ది రాజాసాబ్. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మారుతి టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరడం పక్కా అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ప్రభాస్ 75 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
నిర్మాత విశ్వప్రసాద్ మొత్తం రెమ్యునరేషన్ ను ఒకేసారి ఇచ్చేశారని తెలుస్తోంది. మారుతి ప్రభాస్ ఇమేజ్ కు అనుగుణంగా అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారని ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2026 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా థియేటర్ల విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ సినిమాకే ఉంటుంది.