చిరంజీవి అనిల్ మూవీపై పెరుగుతున్న అంచనాలు.. సరికొత్త రికార్డులు పక్కా!
మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో నయనతార కనిపించనుండగా ఇప్పటికే చిరంజీవి నయన్ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కాయి. సాధారణంగా సినిమాల ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఈ దర్శకుడి రేంజ్ మరింత పెరగడం పక్కా అని చెప్పవచ్చు. ఈ దర్శకుడి పారితోషికం 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.
సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కానుండగా వరుస విజయాలు సాధిస్తున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా కలెక్షన్ల విషయంలో పెద్ద సినిమా అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ సినిమా కూడా 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన విడుదల కానుంది. హీరోగా విజయ్ కు ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.