ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీపై ఫ్యీజులు ఎగిరే క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ డ్రాగన్ ’ ( ఫైనల్ టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది ) సినిమాపై ఆసక్తికర అప్‌డేట్స్ వాస్తవానికి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఎంట్రీ సీక్వెన్స్ పై కొత్త సమాచారం అభిమానుల్లో హైప్‌ను పెంచుతోంది. ఎన్టీఆర్ న‌టించిన వార్ 2 సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు తెలుగు సినీ అభిమానులు అంద‌రూ డ్రాగ‌న్ సినిమా లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూసేందుకు రెడీ గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా నుంచి వ‌స్తోన్న ఏ చిన్న అప్‌డేట్ అయినా సినీ అభిమానుల్లో హైప్ పెంచుతోంది. డ్రాగ‌న్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ అగ‌ర్వాల్ ను నీల్ అప్రోచ్ అవుతున్న‌ట్టు స‌మాచారం.


వాస్త‌వానికి ఈ పాత్ర కోసం ముందుగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె ప్లేస్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.  మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నా ఏ చిన్న అప్‌డేట్ అయినా కూడా సినిమాపై అమాంతం క్రేజ్ పెంచుతుంది. ఇక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా వ‌స్తోంద‌ని తెలుస్తోంది.


డ్రాగ‌న్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ఎంతో క‌ష్ట‌ప‌డుతూ ప్ర‌తి సీన్ డిజైన్ చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: