ఎడిటోరియల్: దేశంలో ఏ ఇతర నాయకునికి లేని ఆ రోగమే చంద్రబాబు కొంప ముంచింది?

శాసనసభ రెండో రోజు సభాపతిగా తమ్మినేని సీతారాం ఎంపిక జరిగిపోగా ఆయనను మర్యాద పూర్వకంగా సభాపతి స్థానానికి ఆహ్వానించటంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు పాల్గొనటం ప్రొటోకాల్ అంటే రాజ్యాంగపర మర్యాద. దానిని అనుసరించకుండా తన సహచరులను అందుకు పురమాయించటం ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడి ఔన్నత్యాన్ని ధారుణంగా దిగజార్చింది.


వయసు మీదపడ్డాక పదవీ విరమణ అనే సాంప్రదాయం ఆచరణలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తరాలు మారటం ద్వారా వ్యక్తుల ఆలొచనలు కూడా మారుతాయి కదా! పెద్ద తరం వాళ్ళకు యువతరం భావాలు “వెకిలిగా అగౌరవనీయంగా సరిగా చెప్పాలంటే హుందా తనం లేనివిగా వయసుమళ్ళిన వారికి కనిపిస్తాయి. ఇక వర్తమాన యువతరంలో ఉన్న వారికి పాత తరంవారి పోకడ చాదస్తంగా మారుతుంది.

దీని వలన నా సీనియారిటీని  గౌరవించడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు, ఇలా మధన పడుతూ స్వీయ అవమానం చెందుతూ పెద్దలు తెగ కుంగి పోతూంటారు. ఆంధ్రప్రదేశ్ లో కొలువు తీరిన కొత్త శాసనసభ రూపు రేఖలు చూశాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సీనియర్ మోస్ట్ సిటిజన్” అయ్యాడన్న ఆలోచన అందరిలో కలుగుతుంది. అక్కడ ఉన్న వారిలో అధికులు 55ఏళ్ళ లోపు వారే.


చంద్రబాబుతో దాదాపు సమకాలీనులు అయిన వారు తమ్మినేని సీతారాం, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర బోస్ వంటి వారు ఉన్నా వారు మంత్రులుగా, శాసనసభాపతులుగా అధికారంలో కుదురుకున్నారు. అందువల్ల వారికి బాధ లేదు. ఇక చంద్రబాబు విషయంలోనే తంటా అంతా. ఆయనకు డాబులు డంబాలు బడాయిలు ఎక్కువ. ఆయనకు అవమానకరమైన ఓటమి కూడా తాజా ఎన్నికల్లో ప్రజలు  ఇచ్చారు.

మానసిక విఙ్జానవేత్తలు వయోపరంగా వచ్చే మానసిక పరిణామాలను గమనించే పెద్దవారు హద్దులు దాటకుండా బుద్దిగా ఉండాలని అందుకు పదవీ విరమణ ఒక్కటే తరుణోపాయమని చెబుతున్నారు. అంటే వారి మర్యాద వారి ప్రవర్తనలోనే లేదా విధానంలోనే ఉంది. యువత అనుభవఙ్జుడని సలహా అడిగితే ఉత్తమమైన సలహాయిచ్చి వారిని ప్రయోజనకరమైన మార్గంలో నడిపితే యువతకు అలాంటి పెద్దలపై పితృభావన ఏర్పడుతుంది.


అలాకాకుండా నిన్నటి వరకూ చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సీనియారిటీ అనే పదం ఇపుడు వైసీపీవారి నోళ్ళలో పడి మంచిహాస్యం పండిస్తుంది. మాట మాటకు  చాలు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటాడు మరి గత ఐదేళ్ళలో ఆయన ప్రజలకు చేసిన ప్రయోజనం ఏముందో? పది నిమిషాలైనా చెప్పలేడంటూ చంద్రబాబును శిరస్సు నుండి పాదాల వరకు ఏకి పారేస్తున్నారు. సెటైర్లు పండిస్తున్నారు. 

చంద్రబాబు సైతం మొదటిరోజే ప్రస్తుత యువతతో నిండిన శాసనసభలో ర్యాగింగ్ అనుభవాన్ని చవిచూశారు. అయినా సరే ఇంకా ఆయన అమాయకత్వమో, ఆర్భాటమో తెలియదు కానీ సభలోని సభ్యులందరిలోను   నేను సీనియర్ని - ఇలాంటివి నా జీవితంలో ఎన్నో చూశాను - అంటూ అక్కడే మరోసారి చెప్పుతున్నారు. అయినా చంద్రబాబుగారి అనుభవం గోల హాస్యోక్తై అందరికి నవ్వులాటగా మారింది. 


కనీసం ఆయన తన అనుభవంతో ఏపికి మేలు చేసుంటే సీనియారిటీకి మర్యాద దక్కేది. అలా ఆయన ప్రవర్తించక రాజకీయ అవసానకాలంలో నేను, నా కొడుకు, నా కుటుంబం, నా సామాజికవర్గం, నా బందువులు, నా పార్టీ వాళ్ళు అంటూ ఐదేళ్ళు గడిపి బిజేపి లాంటి మిత్రునితో అసంబద్ధంగా విడిపోయి ఎన్డీఏ నుండి బయటకు  రావటం ఆయన అవివేకాన్నో అహంభావన్నో అహంకారాన్నో సూచిస్తుంది. తర్వాత బిజేపీ ది మాత్రమే నేఱమని రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించిందంటూ ధర్మ పోరాట దీక్షలు, న్యాయ పోరాట దీక్షలు అంటూ వాళ్ళ పరువే కాదు తన పరువు ప్రతిష్ట కోల్పోయారు.

ఆ తరవాత నరేంద్ర మోడీపై దేశంలోని ప్రతిపక్షాలను ఐఖ్యంచేసి తానే పతనమై పోయారు. బీజేపి సాధించిన ఘనతర విజయానికి “వీరంతా మోడీకి వ్యతిరేఖంగా ఐఖ్యంకావటమే” అని వేరే చెప్పక్కరలేదుఇపుడున్న పరిస్థితుల్లో వైసీపీ రాష్ట్రంలో ఊహాతీత మెజారిటీ శాసనసభలో సాధించింది.


వయసులో కొడుకు సమానుడైన వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంగా ఉంటే చంద్రబాబు ప్రతిపక్షంలో మూలన కూర్చోవడం ఆయనకే  కాదు చూసే వారికి కూడా బాగులేదు. చంద్రబాబు వైఎస్ జగన్మోహనరెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  సమకాలీనుడు. ఆ తరంలో ఉన్న వారంతా ఇపుడు రాజకీయంగా రిటైర్ అయిపోయారు. చంద్రబాబుకి వారసుడు లోకేష్ అందివస్తే అలాగే చేసేవారు కానీ మంగళగిరి లో ఓటమి పాలు కావడంతో తానే విపక్షస్థానంలోకి రావాల్సివచ్చింది.


గతంలో చంద్రబాబు బాధితులు మొత్తం శాసనసభ  వైసీపిలో చేరిపోయారు. ఇది వారికి దొరికిన అవకాశం.  బాబు ఏది మాట్లాడినా అంతకు మించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు పదుల సంఖ్యలో వైసీపి నాయకత్వం సిద్ధంగా ఉంది. ఈ గందర గోళం ఆగాలంటే చంద్రబాబు సీనియారిటీకి తగిన మర్యాద దక్కాలంటే ఆయన సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. 

ఇప్పుడు తన జూనియర్ నాయకులకు ప్రతిపక్ష బాద్యతలు అప్పగించి కీలక సమయాల్లో తను హాజరయ్యేలా చూసుకోవాలి. అదే సమయంలో పార్టీ అధినేతగా ఆయన తన సమయాన్ని పార్టీ అభివృద్ధికి వెచ్చిస్తే మంచిది. ఎటూ ఫిరాయింపులు ఉండవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభయం ఇచ్చారు కనుక చంద్రబాబుకు తన పార్టీ సభ్యులు గోడ దూకే అనుమానం అసలు అవసరమే లేదు.


ఇదే చంద్రబాబు అనుభవాన్ని కాపాడుకునేందుకు దగ్గరదారి తగినట్లుగా మసలు కోవటమే. మరి చంద్రబాబుకు అంత  హృదయ విశాలత ఉందా? ఆ పని చేయ గలుగు తారా? లేక శాసనసభకు వచ్చి యువ శాసనసభ్యులతో ఇంకా నాకు మాత్రమే నలభైయెళ్ళ అనుభవముంది, నేనే సీనియర్, అంటూ వాగ్వాదానికి దిగుతారా?  అన్నది ఆయనే ఆలొచించుకోవాలి. 

దేశంలో బాబును మించిన అనుభవఙ్జులు ఎల్ కే  అద్వాని, మురళీ మనొహర్ జోషి, లాలు ప్రసాద్ యాదవ్, మూలాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ అందరూ ఉన్నారు. కాని వాళ్ళ ప్రవర్తన వలన వారు చంద్రబాబును మించి ఎంతో కొంత గౌరవం మిగుల్చుకున్నారు. ఎల్ కే అద్వాని, జోషీలు ప్రధానితో పాదాభివందనాలు స్వీకరిస్తున్నారు. మరి చంద్రబాబు పరిస్థితి — పాదతాడనమా?  గెంటివేతనా? వైఎస్ జగన్ చిటికెస్తే టిడిపి ఖాళీ ఔతుందనే పరిస్థితి. ఇక అలోచించుకోవటం చంద్ర బాబు పని - రాజకీయాల్లో మనుటయా? ఎండ్ కార్డ్ వేయించు కోవటమా?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: