జనసేన అభ్యర్థుల తొలి జాబితా..సిద్దం!

Edari Rama Krishna
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నటుడు పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ స్థాపించారు.  ఆ సమయంలో ఆయన పోటీలో నేరుగా నిలబడలేదు.  కానీ, ఏపిలో టీడీపీ, బీజేపీకి బలమైన సపోర్ట్ ఇచ్చారు. ఆ పార్టీల తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  ఏపిలో నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కోయిందని..ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని అటు బీజేపీ, ఇటు టీడీపీ పార్టీల స్నేహానికి గుడ్ బాయ్ చెప్పారు.  ఏపిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన ఏపిలో పదమూడు జిల్లాల్లో ముమ్మర ప్రచారం చేస్తు వస్తున్నారు.  అయితే పవన్ కళ్యాన్ ఇప్పటి వరకు తమ అభ్యర్థుల జాబితా ఏంటో ఎవ్వరికీ తెలియజేయడం లేదని..అసలు పోటీ చేస్తారా చేయరా అన్న మీమాంసలో ఉన్నారని తెగ ప్రచారాలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై జనసేన పార్టీ దృష్టిపెట్టింది.  షెడ్యూల్ కూడా రావడంతో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను జనసేన సిద్ధం చేసింది.

నేడు ఉదయం తన ట్విట్టర్ లో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ జనరల్ బాడీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి.. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసినట్లు తెలిపారు. 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన జనసేన.. మిగిలిన స్థానాల్లో గెలుపు ఖాయం అన్న అభ్యర్థులను ఎంపిక చేసే యోచనలో ఉన్నారట. అలాగే వామపక్షాలతో పొత్తుల అంశంపై కూడా వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని భావిస్తోంది.  అంతే కాదు టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికి స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కళ్యాణ్.

పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీ విజయవాల కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించి..నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో ఉంది. 




After a diligent process, the General body of our Party has finalised the first list of Candidates for 32 Assembly and 9 Parliamentary Constituencies.

— Pawan Kalyan (@PawanKalyan) March 11, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: