వైసీపీలోకి వెళ్లిన రెడ్డి గారికి.. గల్లా జయదేవ్ భలే సవాల్ విసిరాడే..?

Chakravarthi Kalyan

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఒకే పార్టీలో ఉన్న వారు కూడా ఇప్పుడు పార్టీ మారగానే సవాళ్లు విసురుకుంటున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గల్లా జయదేవ్ ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.

 



మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్నటే వైసీపీలోకి చేరారు. ఐతే.. గుంటూరు ఎంపీ సీటు కోసమే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ మారుతున్నారని గల్లా జయదేవ్ అంటున్నారు. మోదుగులకు చేతనైతే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.  గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 



గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై గల్లా జయదేవ్  సమాలోచనలు జరిపారు. ఈ సమయంలోనే మోదుగుల పార్టీని వీడటంపై గల్లా ఘాటుగా విమర్శించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీని వీడినా నగరంలోని రెండు సీట్లు తెలుగుదేశం గెలిచేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని గల్లా పిలుపు ఇచ్చారు.

 



మరి నిజంగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు ఎంపీ సీటుకోసమే పార్టీ మారారా.. ఆయన గుంటూరు ఎంపీ బరిలో దిగుతారా.. అదే నిజమే అయితే మోదుగుల, గల్లా మధ్య పోటీ యమా రంజుగా ఉండే అవకాశం ఉంది. కానీ మోదుగులకు ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుపైనే మక్కువ ఎక్కువ అంటారు. చూడాలి ఇప్పుడు గుంటూరులో రాజకీయం ఏమలుపులు తిరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: