హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న.. జర్నీ ఫేమ్ హీరో జై..!

Divya
కోలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించిన తమిళ నటుడు జై గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదట జర్నీ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇందులో హీరోయిన్గా అంజలి నటించడంతో వీరిద్దరికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ అక్కడక్కడ కలిసి కనిపించడంతో పాటు పలు సినిమాలలో నటించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ విడిపోవడం జరిగింది.. అలా ఎవరి బిజీ లైఫ్ లో వారు మునిగిపోయారు.

జై ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా తక్కువ సినిమాలలోనే నటిస్తున్నారు. కేవలం కోలీవుడ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ గడిచిన కొన్ని గంటల క్రితం అందరికీ షాక్ ఇస్తూ హీరోయిన్ ప్రగ్యా  నగారాతో  కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా కోలీవుడ్ లో ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ మెడలో మంగళసూత్రం ఉండడంతో పాటు ఆమెకు బాగా జై దగ్గర కూర్చొని మరి ఉండడమే  కాకుండా వీరిద్దరి చేతిలో రెండు పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్లు కూడా కనిపిస్తున్నాయి.

జై, ప్రగ్య ఇద్దరు వివాహం చేసుకొని హనీమూన్ కి వెళ్తున్నారంటూ కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ జంటకు కంగ్రాజులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు.. కానీ అందుతున్న సమాచారం మేరకు కేవలం ఇదంతా ఒక సినిమా ప్రమోషన్ కి అన్నట్లుగా సమాచారం.. వీరిద్దరూ కలిసి బేబీ అండ్ బేబీ అని ఒక చిత్రంలో నటిస్తున్నారని అలా సినిమా షూటింగ్లో భాగంగానే వీరు ఇలా చేసి ఉంటారని.. సినిమా విడుదలకు ముందే ఇలా ప్రమోషన్స్ తో మొదలు పెట్టారేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ ఫోటో అటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: