రింకు సింగ్ ను.. బలి పశువును చేశారు : కృష్ణమాచారి

praveen
గత కొన్నేళ్ల నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్సీలో గెలిచిన ఐసీసీ ట్రోఫీ తప్ప ఇప్పటివరకు కెప్టెన్లు మారిన టీమిండియా మాత్రం వరల్డ్ కప్ ముద్దాడ లేకపోయింది. అయితే రోహిత్ కెప్టెన్సీలో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో తప్పకుండా టీమిండియా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ.. వరుస విజయాలతో దూసుకుపోయిన భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయి నిరాశపర్చింది. అయితే ఇప్పుడు యూఎస్ వెస్టిండీస్ వేదికలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో గెలవడమె లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది.

 అయితే టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ఇటీవలే ప్రకటించింది. అయితే వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి కూడా ఇలా జట్టు వివరాలను ప్రకటిస్తే కొంతమంది ఆటగాళ్లకు అన్యాయం జరిగింది అంటూ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా జట్టు ఎంపికలో కాకుండా రిజర్వుడు ఆటగాళ్ల లిస్టులో చోటు సంపాదించుకున్న రింకు సింగ్ కి అన్యాయం జరిగిందంటూ కొంతమంది సెలెక్టర్ల తీరుపై మండి  పడుతున్నారు. ఐపీఎల్ సహా గతంలో టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ అతని సెలెక్టర్లు పక్కన పెట్టడం ఏంటి అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

 అయితే రింకుని సెలెక్ట్ చేయకపోవడం పట్ల పలువురు మాజీలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే విషయంపై మరో మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సేలెక్టర్లు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకు అసలు నచ్చలేదు. ప్రపంచమంతా రింకు సింగ్ గురించి మాట్లాడుకుంటుంది. అలాంటి వాడిని మీరు ఎలా డ్రాప్ చేస్తారు. నా దృష్టిలో జైష్వాల్ ను డ్రాప్ చేసైన రింకూను తీసుకోవాల్సిందే. మొత్తం వ్యవహారంలో రింకు సింగ్ ని బలి పశువును చేశారు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: