ముంబై ఇండియన్స్ లో గ్రూపులే.. ఆ జట్టు ఓటమికి కారణం : క్లార్క్

praveen
సాధారణంగా ఏదైనా టోర్నీలో ఛాంపియన్ టీం బరిలోకి దిగుతుంది అంటే చాలు ఆ జట్టు నుంచి మినిమం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అందరిని అలరించే ఐపీఎల్ టోర్నీలో కూడా ఇదే జరుగుతుంది. ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవకపోయినా.. ఇక తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాయని అభిమానులు ఊహిస్తూ ఉంటారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై జట్టు మంచి ప్రదర్శన చేస్తుంది.

 కానీ మరో ఛాంపియన్ టీం అయినా ముంబై ఇండియన్స్ మాత్రం కొత్త కెప్టెన్ తో బలిలోకి దిగిన చెత్త ప్రదర్శన మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలోనే తమ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం మూడే మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో ఇక పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే టైటిల్ గెలవడమె కాదు కనీసం ప్లే ఆఫ్ లో కూడా క్వాలిఫై అవ్వలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.

 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ వరస ఓవటములతో ఆ జట్టు అభిమానులు నిరాశలో మునిగిపోతున్నారు. ఇక విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారూ అని చెప్పాలి. అయితే ముంబై వరుస ఓటములకు ఆ టీంలో చీలికే కారణమని ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ముంబై ఆటగాళ్లు కలిసిమెలిసి ఉండట్లేదు. వారంతా రెండు గ్రూపులుగా ఉన్నారు. ఒక టీం గా ఆడట్లేదు. మంచి ప్లేయర్లు ఉన్న టీం ఈ సీజన్లో ఇంత చెత్తగా ఆడుతుంది అంటే దానికి అదే కారణం. బుమ్రా, రోమారియో షెఫర్డ్ పోరాటం వల్లే ఆ జట్టు కనీసం మూడు మ్యాచ్లు అయినా గెలిచింది అంటూ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: