మరో క్రేజీ హీరోని పట్టుకున్న శ్రీను వైట్ల?

Purushottham Vinay
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన శ్రీను వైట్ల ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఢీ, రెడీ, దూకుడు.. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కోన వెంకట్, గోపీ మోహన్ తో కలిసి తీశారు శ్రీను వైట్ల.రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా దాకా వీరంతా కలిసి పనిచేశారు. ఆ తర్వాత మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు. వారు విడిపోయాక.. ఇద్దరికీ సరైన హిట్లు పడలేదు.అయితే శ్రీనువైట్ల.. చివరగా మాస్ మాహారాజా రవితేజతో 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. మ్యాచో స్టార్ గోపీ చంద్ చేస్తున్న విశ్వం మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీతో హీరో గోపీచంద్ కూడా హిట్ కొట్టాలని బాగా ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీనువైట్ల.. విశ్వం మూవీ తర్వాత కొత్త సినిమా ఎవరితో చేయనున్నారోనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను శ్రీను వైట్ల కలిసినట్లు ఇటీవల వార్త బయటకొచ్చింది.



వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల.. రామ్ కు కథ బేసిక్ పాయింట్ ను కూడా వినిపించారని సమాచారం తెలుస్తోంది. అయితే రామ్ కి ఆ పాయింట్ నచ్చి.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మన్నారని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం శ్రీను వైట్ల పూర్తి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారట. త్వరలోనే రామ్ కు మొత్తం కథ నెరేట్ చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తోంది. విశ్వం మూవీ రిజల్ట్ వచ్చిన తర్వాత రామ్.. శ్రీను వైట్ల కు ఓకే చెప్పనున్నారని వార్తలు విపిస్తున్నాయి.రామ్.. త్వరలో డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, శ్రీను వైట్లకు రామ్ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: