గేమ్ చేంజర్: ఇంకా షూటింగ్ ఎంతుందంటే?

Purushottham Vinay
రామ్ చరణ్ చేస్తున్న గేమ్‌ చేంజర్‌ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శంకర్‌ భారీ బడ్జెట్‌ తో దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ మూవీని రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు.గేమ్‌ చేంజర్ మూవీ కోసం రామ్‌ చరణ్‌ చెన్నై ప్రయాణం అయ్యాడు.అక్కడ హీరోయిన్ అంజలితో పాటు ముఖ్య తారాగణం తో రామ్‌ చరణ్ రెండు లేదా మూడు రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లు యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ ను రెండు విభిన్నమైన పాత్రల్లో శంకర్ ఈ మూవీలో చూపించబోతున్నాడు.కేవలం రెండు లేదా మూడు రోజుల షెడ్యూల్‌ కోసం రామ్‌ చరణ్ చెన్నై వెళ్తున్నాడు అంటే ఎంత కీలకమైన సన్నివేశాలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాటల షూటింగ్ తో పాటు కీలకమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయని, జూన్ లేదా జులై దాకా సినిమా మొత్తాన్ని పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట.


హీరోయిన్ గా కియారా అద్వానీ ఈ మూవీలో కనిపించబోతుంది. ఫ్ల్యాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో చరణ్ కు జోడీగా మాత్రం అంజలిని చూడబోతున్నారు. శంకర్‌ సినిమా అంటే మంచి మెసేజ్ తో పాటు పుష్కలంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ మూవీలో కూడా అన్ని విధాలుగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.శ్రీకాంత్‌, రవిబాబు, సునీల్‌ తో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌ లో ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. దిల్‌ రాజుకు ఈ మూవీ నిర్మాతగా 50వ సినిమా అవ్వడంతో ఎక్కడ రాజీ పడకుండా భారీగా ఖర్చు చేస్తూ నిర్మిస్తున్నాడు.ఈ ఏడాదిలోనే గేమ్‌ చేంజర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్‌ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శంకర్‌ కూడా అందుకు తగ్గట్లుగానే జులై దాకా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. మరి చూడాలి హీరో రామ్ చరణ్ కి ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: