టీమిండియా తరఫున.. ఎక్కువ ఐసీసీ టోర్నీలు ఆడిన ప్లేయర్లు వీళ్లే?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇటీవల ipl లో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కూడా ఇక టి20 వరల్డ్ కప్ షెడ్యూల్లో బరిలోకి దిగబోయే జట్టు వివరాలను ప్రకటించాయి. ఇక ఇటీవల బీసీసీఐ సైతం ఇలా వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది అని చెప్పాలి.

 అయితే మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేయబోయే ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ లో భారత ఆటగాళ్ల గత గణాంకాలు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎక్కువ సార్లు ఐసిసి టోర్నీలో ఆడిన ఆటగాళ్లు ఎవరు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఆ వివరాలు చూసుకుంటే... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీలు కలుపుకొని ఇక ఇండియా తరఫున అత్యధికంగా  ఐసీసీ టోర్నీల ఆడిన ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోని టాప్ లో ఉన్నాడు. ఏకంగా 14 సార్లు ఐసిసి టోర్నీలలో భాగమయ్యాడు ధోని   ఇక ఇందులో ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా ఇలా వరల్డ్ కప్ లలో పాల్గొన్నాడు. అతని కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. అయితే ధోని మాత్రమే కాదు యువరాజ్ కూడా 14 సార్లు ఐసిసి టోర్నీలలో టీమిండియాలో భాగమయ్యాడు. ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ తో రోహిత్ కూడా అటు 14సార్లు ఐసిసి టోర్నీలలో టీమిండియా కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు. తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 13, సచిన్ 11, హర్భజన్ 11 తో తర్వాత స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: