బీర్ ఎక్కువ తాగితే ఇన్ని ఘోరమైన నష్టాలా?

Purushottham Vinay
మద్యాన్ని ఎక్కువ ఇష్టపడే మందు బాబులు ఎంతో ఇష్టంగా తాగే డ్రింక్స్‌లో బీర్ కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే బీర్‌ను చాలా మంది ప్రతి రోజూ ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. ఎండా కాలంలో ఎండ వేడికి చల్లని బీర్ తాగితే వచ్చే మజాయే వేరుగా ఉంటుందని చాలా మంది మందు బాబులు ఇంకా మద్యం గురించి తెలియని మహానుభావులు అపోహ పడుతూ చెబుతుంటారు. లిమిట్ లో తాగితే ఏం కాదు గానీ అధికంగా తాగితే మాత్రం ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రతి రోజూ బీర్ తాగితే అసలు ఏం జరుగుతుంది? ఇంకా మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇంకా ఏ విధంగా నష్టం జరుగుతుంది? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. బీర్ ని మితంగా తాగితే ఎముకల సాంద్రత పెరుగుతుందట. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది చాలా రకాలుగా మేలు చేస్తుందట. బీర్ తాగడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. అయితే ప్రతి రోజూ కూడా బీర్ తాగకూడదు. కేవలం వారానికి ఒకసారి ఒక టిన్ బీర్ తాగితేనే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది.


అధిక బరువు సమస్య ఉన్నవారు ఇంకా అలాగే లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు బీర్‌ను తాగకపోవడమే మంచిది. అధిక బరువు తగ్గాలనుకునే వారు బీర్ తాగితే ఆ ప్రక్రియకు ఖచ్చితంగా ఆటంకం కలుగుతుంది. కాబట్టి వీరు బీర్‌ను అస్సలు తాగకూడదు. ఇక బీర్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల పేగులకు ఎంతగానో నష్టం కలుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విరేచనాలు, గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బీర్ సేవించడం వల్ల శరీరంలో ద్రవాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి.ఇక రోజూ బీర్ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. చాలా మంది మద్యం సేవిస్తే చక్కగా నిద్రపడుతుందని అనుకుంటారు. అది వాస్తవమే అయినప్పటికీ ఆరంభంలో మాత్రమే ఇది పనిచేస్తుంది. రోజూ బీర్ తాగితే నిద్ర పట్టకపోగా ఇంకా నిద్రలేమి ఎక్కువవుతుంది. దీర్ఘకాలికంగా నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. దీంతో మెదడు పనితీరు మందగిస్తుంది. కాబట్టి బీర్‌ను వారానికి ఒకసారి మాత్రమే పరిమితం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: