సుందర్ పిచాయ్ ఇండియా వస్తే.. ఇష్టంగా ఏం తింటారో తెలుసా?

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటు భారత ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలకు చాటుతూ.. గూగుల్ ను వరల్డ్ నంబర్ వన్ ప్లేస్ లో నిలిపేందుకు నిత్యం కృషి చేస్తున్న కృషీ వలుడు ఆయన. భారత్ కు చెందిన ఆయన ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా మారారు.

సుందర్ పిచాయ్ జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ దిగ్గజాలను మరింత ఎత్తుకు నడిపిస్తున్నభారత సంతతి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అతను తన ఎక్కువ సమయాన్ని యునైటైడ్ స్టేట్స్ లోనే గడుపుతుంటారు. అయినా తన మూలాలతో మాత్రం బాగా కనెక్ట్ అవుతుంటారు. ఇటీవల ఒక యూట్యాబర్ వరుణ్ మయ్యాతో కలిసి పాడ్కాస్ట్ కోసం కూర్చొన్న ఆయన భారత్ పై కృత్రిమ మేథ ప్రభావం, భారతీయ ఇంజినీర్లకు పలు సలహాలు సూచనలు చేశారు.

పాడ్కాప్ట్ ముగింపు సందర్భంగా పిచాయ్ తనకు ఇష్టమైన భారతీయ వంటకాలను వెల్లడించారు. పాడ్కాస్ట్ సమయంలో భారతదేశంలో మీకు ఇష్టమైన వంటకం ఏంటి అని సుందర్ ను మయ్యా అడిగినప్పుడు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఏ ప్రాంతాన్ని కించపరచకుండా దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం పాటిస్తూ సమాధానం చెప్పారు.

దేశంలో మెట్రో పాలిటన్ నగరాలైన దిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి తనకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకున్నారు. బెంగళూరు నుంచి దోసె, దిల్లీ కి చెందిన చోలే భతురే, ముంబయి నుంచి పావ్ బాజీలను ఇష్టంగా తింటానని వెల్లడించారు. బెంగళూరు వెళ్తే నాకు దోసె దొరుకుతుంది. ఇది నా ఫేవరెట్ ఫుడ్. అదే దిల్లీ అయితే చోళ భతురే. ముంబయి అయితే పావ్ బాజీ తింటాను అని చాలా తెలివిగా, దౌత్యపరమైన సమాధానం ఇచ్చారు. అదే ఒకే ప్రాంతానికి ఆయన తన వంటకాన్ని పరిమితం చేస్తే లేని పోని వివాదాలకు కారణం అయ్యేదే. అందుకే ఆయన తెలివిగా ఈ సమాధానాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: