రాయలసీమ: పార్టీ మారడంతో చంపుతామని బెదిరిస్తున్న వైసీపీ నేత..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల సైతం రోజురోజుకి ఉత్కంఠతను పెంచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఓటింగ్ సరళి పెరగడంతో నేతలు కూడా ఆందోళనతో ఉన్నారు. అలాగే గెలుస్తామని ధీమాలో పార్టీ అధినేతలలో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట భయం అనేది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నేతలు కార్యకర్తలు సైతం పార్టీ మారడం వంటివి ఎన్నో సందర్భాలలో మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా రాయలసీమలోని శింగనమల నియోజకవర్గం లో వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి చేరిన నేతకు ఇంటికి వెళ్లి మరి వైసీపీ నేత వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

సింగనమల నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ ని ఎన్నిక చేయడం జరిగింది.. టిడిపి అభ్యర్థిగా బండారు శ్రావణి గతంలో కూడా ఓడిపోవడంతో ఈసారి కూడా ఆమెకే టికెట్టు ఇచ్చారు. టిప్పర్ డ్రైవర్ కు వైసిపి పార్టీ నుంచి టికెట్ ఇవ్వడంతో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈ అసంతృప్తులు ఎన్నోసార్లు బయటపడ్డాయి. దీంతో కొంతమంది పార్టీ మారడం కూడా జరిగింది. తాజాగా సింగనమల నియోజకవర్గం లో ఉండే చిన్న జాలాలపురంలో  ఈ సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా పట్నం నాగేష్ అనే వ్యక్తి వైసీపీలో ఎన్ని రోజులు ఉండగా ఇటీవలే టీడీపీలోకి చేరారు. ఈ విషయం తెలిసిన అక్కడ  వైసీపీ నేత బొమ్మన శ్రీరామ్ రెడ్డి తన అనుచరులతో కలిసి పట్నం నగేష్ ని బెదిరిస్తున్నట్లుగా సమాచారం.

ఇటీవల పట్నం నగేష్ టిడిపిలో చేరడంతో ఈ వైసీపీ నేత తన అనుచరులతో కలిసి ఇంటికి వెళ్లి మరి బెదిరించారని జూన్ 4వ తేదీన కచ్చితంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఫలితాల రోజున తనని చంపేస్తామంటూ హెచ్చరించారట. ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏది ఏమైనా రాయలసీమలో మరొకసారి ఫ్యాక్షనీజానికి తెర లేపేయాలా వైసీపీ నేతలు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలలో కూడా ఫ్యాక్షనిజం మరొకసారి ఉద్రిక్తత కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: