ఒంట్లో వేడిని చిటికెలో తగ్గించే చిట్కాలు?

Purushottham Vinay
సమ్మర్ లో ఎండలు భగ భగ మండిపోవడం చాలా సహజమే. అయితే కొంతమందికి ఎండలో తిరగకున్నా కూడా వేసవి కాలంలో వాతావరణం వల్ల ఖచ్చితంగా వేడి చేస్తుంది. ఇక ఎండలో తిరిగే వారికి ఎలాగూ వేడి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేడి మరీ ఎక్కువగా ఉంటే కొందరు తట్టుకోలేరు.ఖచ్చితంగా ఇతర అనారోగ్యాల బారిన పడుతుంటారు. మరి అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.సోంపు, జీలకర్ర, ధనియాలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీళ్లను తాగడం వల్ల కూడా శరీరంలోని వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అదవిధంగా రోజుకు ఒకసారి దానిమ్మ గింజలను ఒక కప్పు మోతాదులో తినాలి, లేదా జ్యూస్ అయితే ఒక గ్లాస్ తాగాలి. దీంతో కూడా వేడి ఇట్టే తగ్గుతుంది. ఇక రోజూ రాత్రి మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగాలి. అలాగే పుల్లని పండ్లు, బీట్‌రూట్‌, క్యారెట్ లను వేసవిలో తక్కువగా తీసుకోవాలి. కీరదోస, పుచ్చకాయ, తర్బూజాలను అధికంగా తినాలి, మామిడి పండ్లు వేడి చేస్తాయి. కాబట్టి వాటిని రోజుకు ఒక పండుకు మించకుండా తినాలి.


ఇలా ఈ విధంగా పండ్లని వేడి నుంచి శరీరానికి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ప్రతి రోజూ తాటి బెల్లం కలిపిన నీళ్లను 2 కప్పుల మోతాదులో తాగుతుండాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగాలి. దీని వల్ల కూడా శరీరంలోని వేడి తగ్గుతుంది. అలాగే ప్రతి రోజూ ఎర్ర మందార పువ్వులతో తయారు చేసి టీ డికాషన్‌ను తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కుంకుమ పువ్వు కలిపిన పాలను రోజూ రాత్రి భోజనం అనంతరం తాగాలి. దీని వల్ల కూడా వేడిని తగ్గించుకోవచ్చు.ప్రతి రోజూ ఉదయాన్నే నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. వేడి మరీ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం సమయంలోనూ ఇంకో గ్లాస్ తాగవచ్చు. దీంతో వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఉదయం కొబ్బరినూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్‌తో శరీరాన్ని మర్దనా చేయాలి. అనంతరం స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే శరరీంలో అసలు వేడి  ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: