టివి: నటుడు చందు గురించి.. నిజాలు చెప్పేసిన తల్లి..!

Divya
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం అకస్మాత్తుగా మరణించడంతో అతని ప్రియుడు చంద్రకాంత్ కూడా ఈ విషయాన్ని భరించలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది.. అయితే గత ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనంలోనే కొనసాగుతున్నారనే వార్తలు బయటపడ్డాయి. పవిత్ర మృతి తర్వాత చంద్రకాంత్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి పవిత్ర మరణం గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఆ బాధ భరించలేక తను బలవస్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నటుడు చందు మరణం పట్ల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు..

అయితే ఇప్పుడు తాజాగా చందు గురించి అతని తల్లి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది.. చందు తల్లి మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి చందు పవిత్ర తోనే ఉంటున్నారనీ వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారని పవిత్రతో పరిచయం అయిన దగ్గర నుంచి చందు తన భార్య పిల్లల్ని అసలు పట్టించుకునేవారు కాదనీ ..కేవలం తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు కొట్టేవాడని చాలా ఇబ్బందులు పెట్టాడని తెలిపింది. యాక్సిడెంట్ తర్వాత తన కొడుకు అసలు తనతో మాట్లాడేవాడు కాదని కూడా తెలియజేసింది. అలాంటి సమయంలో తన కోడలు చూడడానికి వెళితే కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదంటూ తెలిపింది చందు తల్లి.

తన కొడుకు మారతాడని ఎంతో ఆశగా చూశాను యాక్సిడెంట్ తర్వాత అతను తన ఫ్రెండ్ ఇంట్లో ఉండేవారు పవిత్ర ఎల్ఐసి డబ్బుల కోసం వెళుతున్నానని చెప్పి బయటికి వెళ్లిపోయారని ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు అంతలోనే ఉరివేసుకొని చనిపోయాడని తెలిసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపింది చందు తల్లి.. చందు భార్య శిల్ప మాట్లాడుతూ స్కూల్ వయసులోనే తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చందుకు సీరియల్స్ లో అవకాశం మొదట తానే ఇప్పించానని.. ఆ తర్వాతే వరుసగా ఆఫర్లు వచ్చాయని.. త్రినయని సీరియల్ చేస్తున్న సమయం నుంచే పవిత్రత చందు కి సంబంధం ఉందని తెలిపింది. ఆమె మోజులో పడి తమ కుటుంబాన్ని అన్యాయం చేశారని చందు భార్య శిల్ప తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: