పాలు ఎండాకాలంలో ఏ విధంగా తాగితే మంచిది..?

Divya
పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదే.. ముఖ్యంగా శరీరానికి ఎన్నో పోషకాలను సైతం అందించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పాలు తాగడం వల్ల ఎముకలు కూడా చాలా దృఢంగా తయారవుతాయని చిన్నప్పటినుంచి చాలామంది ఎక్కువగా పాలను తాగమని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. అయితే వేసవికాలంలో పాలు తాగితే వేడి చేస్తుందని ఎండాకాలంలో పాలు తాగడం పూర్తిగా మానేస్తూ ఉంటారు కొందరు. మరి ఎండాకాలంలో పాలు తాగడం సరైనదా కాదా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న అభిప్రాయం ప్రకారం ఎవరికైనా కడుపులో ఎసిడిటీ కలిగించే అవకాశం ఉంటుంది.. అందుకే  ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో పాలు తాగకూడదని తెలియజేస్తున్నారు. ఇలా కాలి కడుపుతో పాలు తాగేవారు కచ్చితంగా ఏదైనా నట్స్ తినడం మంచిదని దీనివల్ల కండరాలు కూడా చాలా బలంగా అవుతాయని తెలుపుతున్నారు. ఎండాకాలంలో చల్లని పాలు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడవని తెలుపుతున్నారు.. ఈ పాలు శరీరాన్ని కూడా చల్లగా ఉంచాలా చేస్తాయట చలికాలంలో గోరువెచ్చని పాలు తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా ప్రతిరోజు ఎనర్జీ లభిస్తుంది

ఎవరైనా వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ చేసిన తర్వాత పొరపాటున కూడా పాలు తాగకూడదు ఇలా చేస్తే చాలా ప్రమాదమట. ఇలా చేసిన అరగంట తర్వాత పాలు తాగితే శరీరానికి పుష్కలమైన పోషకాలు కూడా అందుతాయి.. ఎవరికైనా జలుబు లేదా ఫ్లూ ఉంటే పొరపాటున కూడా చల్లని పాలు తాగకూడదని తెలియజేస్తున్నారు. పాలలోకి అలాంటి సమయంలో కాస్త పసుపు వేసుకొని తాగడం వల్ల గొంతు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. వేడి పాలు జీర్ణ సమస్యలు కడుపునొప్పి సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి.. ఎవరైనా నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటే రాత్రిపూట గోరువెచ్చని పాలు తీసుకోవడం మంచిది. చల్లని పాలు తాగడం వల్ల కాల్షియం లభిస్తుంది. పాలలో ఎక్కువగా లాక్టోస్ లభిస్తుంది అందువల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: