ఆ టెక్నాలజీతో చైనా వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అవుతుందా?

frame ఆ టెక్నాలజీతో చైనా వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అవుతుందా?

కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా ఇంతకింతకు పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో జరిగిన విషయాలను కూడా సులభతరంగా తెలుసుకోగలుగుతున్నాం. అయితే స్మార్ట్ ఫోన్ లో ఏ విషయాలనైనా స్పీడ్ గా శోధించాలంటే నెట్ వర్క్ చాలా అవసరం. నిన్న మొన్నటి వరకు 4 జీ గా ఉన్న నెట్ వర్క్ వినియోగదారులకు అనుగుణంగా 5జీ టెక్నాలజీ కి మారిపోయింది.

కొంతమంది వినియోగదారులు ఈ 5 జీ స్పీడ్ తో తృప్తి చెందుతున్నా మరికొందరు మాత్రం ఇంకాస్త స్పీడ్ కావాలని కోరుకుంటున్నారు.  అయితే భారత్ లో ఇంకా సుమారు 35 వేల గ్రామాల్లో కనీసం 2జీ ఇంటర్ నెట్ కనెక్షన్ లేకపోవడం విశేషం. ఇక 4జీ, 5జీ సేవలు కూడా ప్రధాన పట్టణాలకే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలు 6జీ  వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

అయితే 6 జీ టెక్నాలజీతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్యం, వైద్యం, రవాణాతో పాటు మానవ జీవితంలో ప్రతి అంశాన్ని ఇది టచ్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  6జీ టెక్నాలజీతో టాక్టయిల్ ఇంటర్నెట్., హలో గ్రాఫిక్ కమ్యూనికేషన్ వంటివి సాధ్యం అవుతాయి. ఆగ్మెంటెడ్, వర్చువల్ మిక్స్ డ్ రియాలటీలకు ఈ  టెక్నాలజీ సాయం అందిస్తోంది.

6జీ టెక్నాలజీపై పట్టు సాధిస్తే ప్రపంచంపై పెత్తనం చలాయించవచ్చన్న అంచనాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బోలెడు కార్యక్రమాలు నడుస్తున్నాయి. జపాన్ ఈ దిశగా అడుగులు వేసి ప్రపంచంలోని మొట్టమొదటి 6జీ వైరెలెస్ పరికరాన్ని రూపొందించింది. ఇది 90 మీటర్ల దూరంలో 100 జీబీ ఫర్ సెకన్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయగలదు. అయితే ఇప్పుడు చైనా కూడా 6జీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి 2030 వరకు 6జీని ప్రపంచానికి పరిచయం చేయాలని డ్రాగన్ దేశం భావించినా 2025 నాటికే లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  తద్వారా టెక్నాలజీలో అందరికంటే ముందు ఉండాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: