హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌  రియల్‌ ఎస్టేట్‌కు ఇది నిజంగా గుడ్‌ న్యూసే అని చెప్పాలి. మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కీలక ఆదేశాలు జారీ చేయడం గుడ్‌న్యూస్‌గా మారింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, కొత్తగా స్వయం సహాయ సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు.
మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్.. మహిళా స్వయం సహాయ సంఘాల సౌర విద్యుత్ ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. పట్టణాల పరిధిలోని ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంక్ లపై సౌర విద్యుత్తు ప్లాంట్లు నిర్వహిస్తామని దాన కిషోర్ తెలిపారు. వచ్చే 6 నెలల్లో 48 మంది మున్సిపల్ కమిషనర్లు, 300 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల నియామకం చేస్తామన్నారు. పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను 100 శాతం వసూలు చేయాలని దాన కిషోర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: