గేమ్ ఛేంజ‌ర్ : ఓటీటీ ఫ్లాట్‌ ఫాం ఇదే ?

Veldandi Saikiran
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాతో సక్సెస్ అందుకున్న.... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... ఇప్పుడు... మరో సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ చాలా గ్రాండ్ గా తీశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తే... కియారా అద్వానీ... హీరోయిన్గా చేయడం జరిగింది.
 బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తో పాటు... అంజలి కూడా కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య నటించిన జరిగింది. ఏ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్  సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్ షో రూమ్ నడుస్తున్నాయి.
 ఈ సినిమా చూసిన వాళ్లంతా.. గేమ్ చేంజర్ బాగుందని చెబుతున్నారు.  వాస్తవంగా అర్ధరాత్రి ఒకటి నుంచి బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు దిల్ రాజు బృందం. కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. ఉదయం నాలుగు గంటల నుంచి మాత్రమే బెనిఫిట్స్ వేసుకోవాలని చెప్పింది. ఈ తలనంలోనే ఇవాళ ఉదయం 4 గంటల నుంచి 6 ఆరు షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
 ఇక సినిమా పై మంచి పాజిటివ్ టాక్ రావడంతో జనాలు దూసుకెళ్తున్నారు. ఇక.. ఇలాంటి నేపథ్యంలో రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటిటీ హక్కులను అమెజాన్  ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిన వార్తలు వస్తున్నాయి. 100 కోట్లకు పైన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత.... అంటే మార్చిలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: