గేమ్ ఛేంజర్ రివ్యూ: పుష్ప 2 మీద కోపం రామ్ చరణ్ కు దెబ్బా..!

Divya
బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ పాన్ ఇండియా లెవల్లో క్రేజీ సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి బాలీవుడ్ లో కూడా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా కరెంట్ జోహార్ లాంటి అగ్ర నిర్మాతలు కూడా తెలుగు సినిమా పరిశ్రమను మెచ్చుకోవడం జరిగింది. తర్వాత RRR, పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాలతో బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ అని రాబట్టాయి. ముఖ్యంగా పుష్ప 2 అయితే బాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించి మొదటి స్థానంలో నిలిచింది.

అయితే పుష్ప 2 రికార్డులను బద్దలు కోట్టడంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ విషయం పట్టడం లేదట.. అంతేకాకుండా టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ పుష్ప 2 చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు తేలిపోయాయి అంటూ కూడా మాట్లాడడం జరిగిందట. ఇది వాళ్లను చాలా హర్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సౌత్ సినిమాలు నాటికి అక్కడ రోజు పెరుగుతూ ఉండడంతో తమ సినిమాలకు ముప్పు వస్తుందని బాలీవుడ్ లో ఒక్కసారిగా అలర్ట్  సంకేతాలు కనిపిస్తున్నాయట.

సౌత్ సినిమాలను తొక్కేయాలని లేకపోతే తమ సినిమాల ఉనికికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని బాలీవుడ్ నటీనటులతో పాటు సిని సెలెబ్రెటీలు కూడా భయపడుతున్నారట. ఈ క్రమంలోనే సౌత్ లో నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ సినిమాని అక్కడ వారు టార్గెట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి హిందీ మీడియాలో సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ కామెంట్స్ తో తెగ హల్చల్ చేస్తున్నారట. ముఖ్యంగా ట్రైలర్ బాగలేదని నార్త్ ఇండియాలో దీనికి బజ్ లేదని ,బిజినెస్ కూడా జరగలేదని పలు రకాల వార్తలను వైరల్ గా చేస్తున్నారట. ఇదంతా కూడా పుష్ప 2 సినిమా సక్సెస్ తట్టుకోలేకనే ఇలా చేస్తున్నారని నెటిజెన్స్ వాపోతున్నారు. ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న పుష్ప 2 చిత్రాన్ని ఏమి చేయలేక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పైన ఇలా ప్రతికారాన్ని తీర్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాపడుతుందో చూడాలి మరి గేమ్ ఛేంజర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: