ఎడిటోరియల్ : చంద్రబాబును వణికించిన మాగుంట

Vijaya

చంద్రబాబునాయుడును ప్రకాశం జిల్లాలో కీలక నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి వణికించేశారు. నియోజకవర్గంలో మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంతో జిల్లా పార్టీతో పాటు చంద్రబాబు కూడా వణికిపోయారు. రాబోయే ఎన్నికల్లో మాగుంటను ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని చంద్రబాబు పట్టుదల. మరి అదే పట్టుదల మాగుంటలో కనబడటం లేదు. ఎందుకంటే, పార్టీ మీదున్న వ్యతిరేకత వల్ల పార్టీ గెలుపు ఈజీ కాదని అర్ధమైపోయింది. దాంతో పోటీపైన మాగుంటలో అనాసక్తి పెరిగిపోయింది. దానికి తోడు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేసే యోచనలో ఉన్నట్లు ఆమధ్య ప్రచారం కూడా జరిగింది.

 

పార్టీ మారుతారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఒకటికి పది సార్లు మాగుంటతో భేటీ అవుతున్నారు. ఎట్టి పరిస్ధితిల్లోను పార్టీ మారద్దొని మాగుంటను చంద్రబాబు బ్రతిమలాడుకున్నారు. ఎంపిగా పోటీ చేయాల్సిందేనంటూ ఒత్తిడి పెట్టారు. అందుకే మాగుంట అవకాశంగా తీసుకుని తన డిమాండ్ల చిట్టాను విప్పిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి టిడిపి తరపున ఎంపిగా పోటీ చేయటానికి అంగీకరించినా మనసంతా వైసిపి చుట్టూనే తిరుగుతోందట.


ఈ నేపధ్యంలోనే మాగుంట శుక్రవారం తన మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నారు. దాదాపు మూడుగంటల పాటు సమావేశం జరిగింది. ఎప్పుడైతే సమావేశం మొదలైందో వెంటనే ఆ విషయం పార్టీలోని ఎంఎల్ఏలకు తెలిసింది. అదే విషయాన్ని ఎంఎల్ఏలు చంద్రబాబుకు చేరవేశారట. దాంతో చంద్రబాబులో కంగారు పెరిగిపోయింది. దాంతో మాగుంట సమావేశం పెట్టుకున్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోమంటూ పురామయించారు.

 

చంద్రబాబు నుండి ఆదేశాలు రాగానే ఎంఎల్ఏ, జిల్లా అధ్యక్షుడు దామచర్ల తదితరులు వెంటనే సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే మాగుంటతో మాట్లాడారు. లోక్ సభ నియోజకర్గంలోని లోటుపాట్లు తెలుసుకునేందుకే తాను మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నట్లు చెప్పారు.  దాంతో దామచర్ల అదే విషయాన్ని చంద్రబాబు చెప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిజానికి మాగుంట సమావేశం పెట్టుకున్న కారణం ఎవరికీ తెలీదనుకోండి అది వేరే సంగతి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మద్దతుదారులతో ఎంపినో లేదా ఎంఎల్ఏనో సమావేశమైతే చాలు చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. విషయం తెలియగానే టిడిపి నేతలు కూడా ఉలిక్కిపడుతున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో చంద్రబాబు బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. తాజాగా ఒంగోలులో  జరిగిన విషయాన్ని చూస్తే మాగుంట ఎక్కడ టిడిపికి రాజీనామా చేసేస్తారో అన్న టెన్షన్ పట్టి పీడిస్తున్నట్లు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: