నాగోల్‌- శంషాబాద్‌ మెట్రో రూట్‌లో కదలిక?

Chakravarthi Kalyan
హైదరాబాద్ మెట్రోరైలు ఎయిర్ పోర్టు కారిడార్‌లో ముందడుగు పడింది. నాగోలు నుంచి చాంద్రయాణగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మెట్రో మార్గాన్ని మెట్రో ఎయిర్ పోర్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నాగోలు నుంచి 14 కిలోమిటర్ల మార్గాన్ని ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన ఎండీ.. స్థల సేకరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణం, మూసీనది, ఎల్బీనగర్ , బైరామల్ గూడ వద్ద పైవంతెనల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు. జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మెట్రో ఉన్నతాధికారులతో పాటు  ఇంజనీరింగ్ కన్సల్ టెన్సీ సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి 14 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాగోలు - ఎయిర్‌పోర్ట్ మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌కు దగ్గరలో ఎల్‌బి నగర్ వైపు నిర్మించనున్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాంకోర్స్‌ లెవల్‌లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణాన్ని  చేపట్టాలని  ఎండీ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: